ఆంధ్రప్రదేశ్

andhra pradesh

'ఉద్యమం దేశాలు దాటినా...ప్రభుత్వంలో చలనం లేదు'

By

Published : Mar 4, 2020, 3:27 PM IST

అమరావతిని రాజధానిగా కొనసాగించాలని అఖిలపక్ష విద్యార్థి, యువజన సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. మహిళలు, రైతులపై పెట్టిన కేసులు తక్షణమే ఎత్తివేయాలన్నారు.

Youth Students Jac meet On vijayawada press club
విజయవాడలో అఖిలపక్ష విద్యార్థి, యువజన సంఘాల జేఏసీ సమావేశం

విజయవాడలో అఖిలపక్ష విద్యార్థి, యువజన సంఘాల జేఏసీ సమావేశం

అమరావతిని ఏకైక రాజధానిగా కొనసాగించాలని... వెనుకబడిన ప్రాంతాలను అభివృద్ధి చేయాలని అఖిలపక్ష విద్యార్థి యువజన సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. విజయవాడ ప్రెస్ క్లబ్​లో అఖిల పక్ష విద్యార్థి, యువజన సంఘాల జేఏసీ సమావేశం నిర్వహించారు. ఎన్ని కార్యక్రమాలు చేసినా, ఉద్యమం దేశాలు దాటినా, ఇతర రాష్ట్రాల నుంచి మద్దతు వస్తున్న వైకాపా ప్రభుత్వంలో స్పందన లేదన్నారు.

రైతులు 76 రోజులుగా ఉద్యమం చేస్తున్న వైకాపా ప్రభుత్వానికి కనిపించడం లేదన్నారు. మహిళలు, రైతులపై పెట్టిన కేసులు ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. అంబేడ్కర్ వెనుకబడిన వర్గాల రక్షణ కోసం తెచ్చిన చట్టాలను, ఉద్యమాన్ని అణచివేయడానికి వైకాపా నాయకులు ఉపయోగిస్తున్నారని జేఏసీ కన్వీనర్ సుబ్బారావు ఆరోపించారు. మూడు రాజధానుల ప్రకటనను తక్షణమే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థి ప్రజా చైతన్య యాత్రను మార్చి 10వ తేదీ నుంచి ప్రారంభిస్తామన్నారు.

ఇవీ చదవండి...ప్రజాస్వామ్య భారతాన్ని కాపాడుకోలేమా?

TAGGED:

ABOUT THE AUTHOR

...view details