ఆంధ్రప్రదేశ్

andhra pradesh

అనుమానస్పద స్థితిలో యువకుడు మృతి

By

Published : Oct 27, 2020, 5:45 PM IST

విజయవాడలో రైలు పట్టాలపై ఓ యువకుడి మృత దేహం లభించింది. అతడు ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చని రైల్వే పోలీసులు భావిస్తున్నారు. రాజరాజేశ్వరి పేటకు చెందిన జంపాల దాసుగా అతడిని రైల్వే పోలీసులు గుర్తించారు.

youngster suspicious death on railway track
రైలు పట్టాలపై యువకుడి అనుమానాస్పద మృతి

జంపాల దాసు అనే యువకుడు.. రైలు పట్టాలపై అనుమానస్పద స్థితిలో మరణించాడు. విజయవాడ అజిత్​సింగ్ నగర్ వద్ద ఈ ఘటన జరిగింది. పట్టాలపై తల పెట్టి ఆత్మహత్య చేసుకుని ఉంటాడని రైల్వే పోలీసులు భావిస్తున్నారు.

మృతుడిని స్థానిక రాజరాజేశ్వరి పేటకు చెందిన వ్యక్తి జంపాల దాసుగా గుర్తించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details