కృష్ణా జిల్లా వత్సవాయి మండలం లింగాలలో కోడి పందేల బరి వద్ద రెండు వర్గాలు ఘర్షణ పడ్డాయి. ఈ ఘటనలో ఓ యువకుడు మృతి చెందాడంటూ సాయంత్రం ప్రచారం జరిగింది. మృతుడు జగ్గయ్యపేట మండలం చిల్లకల్లువాసిగా గుర్తించారని, యువకుడి మృతితో ఆగ్రహం వ్యక్తం చేసిన చిల్లకల్లు గ్రామస్థులు కోడి పందేల బరులను ధ్వంసం చేశారని వార్తలొచ్చాయి.
కోడిపందేల ఘర్షణలో వ్యక్తి మృతిచెందాడని వదంతులు.. ఖండించిన పోలీసులు
15:40 January 16
కృష్ణా జిల్లా వత్సవాయి మండలంలో ఘటన
అయితే.. ఈ ప్రచారాన్ని జగ్గయ్యపేట సీఐ పుల్లా చంద్రశేఖర్ ఖండించారు. యువకుడు మరణించాడన్న వార్తల్లో నిజం లేదన్నారు. ఎవరికీ ఏమీ కాలేదని, అందరూ సురక్షితంగానే ఉన్నారని తెలిపారు. మరణించాడని చెబుతున్న వ్యక్తి చిన్న గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడని వెల్లడించారు. జరిగిన ఘర్షణపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.
ఇదీ చదవండి :
Accidents in hyderabad: వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు మృతి, మరొకరికి గాయాలు