వినాయక నిమజ్జనాని(Ganesh immersion)కి.. తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్‌లో ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. గణేశ్ నిమజ్జనం సందర్భంగా నగరంలో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఆదివారం ఉదయం 6 గంటల నుంచి సోమవారం ఉదయం వరకు ఈ ఆంక్షలు అమల్లో ఉండనున్నాయి. శనివారం అర్దరాత్రి నుంచే నగరంలోకి అంతర్రాష్ట్ర, జిల్లాల వాహనాలపై ప్రవేశాన్ని నిషేధించనున్నారు. పలుచోట్ల ఆర్టీసీ బస్సులను దారి మళ్లించనున్నారు. విమానాశ్రయం, రైల్వే స్టేషన్లకు వెళ్లే ప్రయాణికులు గణేశ్ నిమజ్జన యాత్ర మీదుగా రాకుండా ప్రత్యామ్నాయ మార్గాలు ఏర్పాటు చేస్తున్నారు.
గణేశ్ నిమజ్జనం(Ganesh immersion) సందర్భంగా.. దారి మళ్లింపు.. ట్రాఫిక్ ఆంక్షల గురించి తెలుసుకునేందుకు, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేయనున్నారు. దీనికోసం 40-27852482, 9490598985, 9010303626 నంబర్లను సంప్రదించాలని సూచించారు. దారి మళ్లింపులు, ట్రాఫిక్ ఆంక్షలను గూగుల్ మ్యాప్‌తో అనుసంధానమై ఎప్పటికప్పుడు అప్డేట్ చేసేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.
గణేశ్ నిమజ్జన(Ganesh immersion)గూగుల్ రూట్ మ్యాప్ & ట్రాఫిక్ ఆంక్షలు
- బాలాపూర్ నుంచి వచ్చే శోభాయాత్ర, ఫలక్‌నుమా నుంచి వచ్చే శోభాయాత్రను.. చార్మినార్, అఫ్జల్‌గంజ్, గౌలీగూడా చమాన్, ఎంజే మార్కెట్, అబిడ్స్, బషీర్‌బాగ్ మీదుగా ట్యాంక్ బండ్ లేదా ఎన్టీఆర్ మార్గ్‌కు తరలింపు.
- సికింద్రాబాద్ నుంచి వచ్చే శోభాయాత్ర.. ఆర్పీ రోడ్, కర్బాల మైదానం, కవాడిగూడ, ముషీరాబాద్ కూడలి, హిమాయత్ నగర్ జంక్షన్, లిబర్టీ మీదుగా ట్యాంక్ బ్యాండ్ లేదా ఎన్టీఆర్ మార్గ్ వైపు మళ్లింపు.
- ఉప్పల్ నుంచి వచ్చే శోభాయాత్ర.. రామాంతపూర్, అంబర్‌పేట కూడలి, శివంరోడ్, ఫీవర్ ఆస్పత్రి, నారాయణగూడ కూడలి, లిబర్టీ మీదుగా కొనసాగేలా ఏర్పాట్లు.
- దిల్సుఖ్నగర్, ఐఎస్ సదన్ వైపు నుంచి వచ్చే శోభాయాత్ర.. సైదాబాద్, నల్గొండ క్రాస్ రోడ్, చాదర్ ఘాట్, ఎంజే మార్కెట్ మీదుగా తరలింపు.
- టోలిచౌకి, రేతి బౌలి, మెహదీపట్నం నుంచి వచ్చే శోభాయాత్ర.. మాసబ్ ట్యాంక్, నిరంకారి భవన్ మీదుగా ఎన్టీఆర్ మార్గ్ వైపు మళ్లింపు.