ఆంధ్రప్రదేశ్

andhra pradesh

'అక్రమ కేసులపై న్యాయస్థానంలో తేల్చుకుంటాం'

By

Published : May 7, 2020, 4:06 PM IST

కరోనా సమయంలో పేదలకు సహాయం చేస్తున్న తెదేపా నేతలపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని ఎంపీ కేశినేని నాని అన్నారు. వైకాపా నాయకులు ర్యాలీలు చేస్తున్నా పోలీసులు పట్టించుకోవటం లేదని విమర్శించారు.

tdp
tdp

తెదేపా ఎమ్మెల్యేలు, ఎంపీలు, నాయకులపై పోలీసులు అక్రమ కేసులు పెడుతున్నారని విజయవాడ ఎంపీ కేశినేని నాని అన్నారు. దీనిపై చట్టపరంగా ముందుకెళ్లి న్యాయస్థానంలో తేల్చుకుంటామని అన్నారు. తెలుగుదేశం పార్టీ నాయకులపై పోలీసులు పెట్టిన అక్రమ కేసులను నిరసిస్తూ, విజయవాడలోని జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తెదేపా రాష్ట్ర కార్యదర్శి గన్నె వెంకట నారాయణ ప్రసాద్ పన్నెండు గంటల నిరాహార దీక్ష చేపట్టారు. ఎంపీ కేశినేని నాని, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, గన్నె వెంకట నారాయణ ప్రసాద్... ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం గన్నె వెంకట నారాయణ ప్రసాద్ దీక్షలో కూర్చున్నారు. కేశినేని నాని, గద్దె రామ్మోహన్ దీక్షకు సంఘీభావం తెలిపారు.

వైకాపా నాయకులు ర్యాలీలు నిర్వహిస్తున్న పోలీసులు పట్టించుకోవటం లేదన్న ఎంపీ కేశినేని... కరోనా వల్ల ఉపాధి కోల్పోయిన పేదలకు సహాయం చేస్తున్న తెదేపా నాయకులపై మాత్రం అక్రమ కేసులు బనాయిస్తున్నారని విమర్శించారు. పోలీసులు ఏకపక్షంగా వ్యవహరించకూడదని సూచించారు.
ఇదీ చదవండి
విజయనగరంలోనూ కరోనా.. రాష్ట్రంలో మరో 56 కేసులు!

ABOUT THE AUTHOR

...view details