ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ప్రతిపక్ష నేతల గొంతు నొక్కే చర్యలు సరికాదు: నిమ్మల రామానాయుడు

By

Published : Sep 21, 2021, 5:29 PM IST

అసెంబ్లీలో ప్రతిపక్షాల గొంతు నొక్కేలా స్పీకర్ నిర్ణయం తీసుకోరని భావిస్తున్నట్లు తెదేపా శాసనసభాపక్ష ఉపనేత నిమ్మల రామానాయుడు అన్నారు. నాలుగు వాయిదాల్లో పింఛన్ రూ. 250 చొప్పున పెంచుతామన్న ముఖ్యమంత్రి..మెుదటి వాయిదా పెంచి తర్వాత పెంచకుండా మోసగించారన్న వాస్తవాన్నే అసెంబ్లీలో చెప్పినట్లు వెల్లడించారు.

ప్రతిపక్ష నేతల గొంతు నొక్కే చర్యలు సరికాదు
ప్రతిపక్ష నేతల గొంతు నొక్కే చర్యలు సరికాదు

నిమ్మల రామానాయుడు

అసెంబ్లీలో ప్రతిపక్షాల గొంతు నొక్కేలా స్పీకర్ నిర్ణయం తీసుకోరని భావిస్తున్నట్లు తెదేపా శాసనసభాపక్ష ఉపనేత నిమ్మల రామానాయుడు తెలిపారు. ఎన్టీఆర్ భవన్​లో నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ.."తెదేపా శాసనసభ పక్ష ఉపనేతలు అచ్చెన్నాయుడు, రామానాయుడులపై చర్యలకు క్రమశిక్షణ కమిటీ తీర్మానం అని మీడియాలో కథనాలు చూసి ఆశ్చర్యపోయా. ఆ రోజు నగదు బదిలీ అంశంపై లఘు చర్చ సందర్భంగా నేను కేవలం 5-6నిమిషాలు మాత్రమే మాట్లాడితే ముఖ్యమంత్రితో పాటు ముగ్గురు మంత్రులు గంటకుపైగా నా ప్రసంగానికి అడ్డుతగిలారు. అధికార పార్టీ ఎంత రెచ్చగొట్టినా సహనంతో మాట్లాడా. కావాలంటే రికార్డులు పరిశీలించుకోవచ్చు. అసెంబ్లీ ద్వారా ప్రభుత్వ తప్పిదాలను నిలదీస్తామనే భయంతో క్రమశిక్షణ కమిటీ మాపై చర్యలు తీసుకుంటే దానిని రాజకీయ కక్షసాధింపుగానే పరిగణిస్తాం. ప్రజాక్షేత్రంలో మా గళం వినిపించి తగిన బుద్ధిచెప్పేలా పని చేస్తాం. నా ప్రసంగంలో ఎక్కడా అసభ్యపదజాలం, అభ్యంతరకర పదాలు లేవు. నాలుగు వాయిదాల్లో పింఛన్ రూ.250చొప్పున పెంచుతానన్న ముఖ్యమంత్రి, మొదటి వాయిదా పెంచి తర్వాత పెంచకుండా మోసగించారన్న వాస్తవాన్నే నేను అసెంబ్లీలో చెప్పా. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలకు 45ఏళ్లకే ఇస్తానన్న ఫించన్ ఇవ్వకుండా చేయూతగా మార్చి రూ.18,750 ఇవ్వటం వల్ల ప్రతీ మహిళా రూ.12,250 నష్టపోతున్నారని తెలిపా. డ్వాక్రా మహిళలకు వైఎస్సార్ ఆసరా వల్ల జరిగే నష్టాన్ని వివరించి, కాపు నేస్తం గురించి మాట్లాడుతుంటే నా మైక్ కట్ చేశారు"అని వెల్లడించారు.

ABOUT THE AUTHOR

...view details