ఆంధ్రప్రదేశ్

andhra pradesh

రైతులకు కన్నీళ్లు మిగిల్చి వైకాపా సంబరాలు: మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి

By

Published : May 31, 2021, 8:22 PM IST

వైకాపా పాలనలో రైతులకు కన్నీరే మిగిలిందని తెలుగురైతు అధ్యక్షుడు మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతు భరోసా విషయంలో అన్నదాతలను ప్రభుత్వం మోసగించిందని దుయ్యబట్టారు.

ysrcp government cheated farmers in AP
రైతులకు కన్నీళ్లు మిగిల్చి వైకాపా సంబరాలు

రాష్ట్రంలో వైకాపా అధికారం చేపట్టిన రెండేళ్లుగా రైతులకు కష్టాలు, కడగండ్లు, కన్నీళ్లు మిగిల్చి సంబరాలు జరుపుకోవటమేంటని తెలుగురైతు అధ్యక్షుడు మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి ధ్వజమెత్తారు. జగన్మోహన్​ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తరువాత.. దుక్కిదున్నడం నుంచి పంటకోసే వరకు అన్నదాతకు అన్నింటా కష్టమే మిగిలిందని మండిపడ్డారు.

రైతులను మోసం చేసిన సీఎంపై సీఐడీ కేసు పెట్టాలి..

రాష్ట్ర ప్రభుత్వ వాటాగా రూ. 12,500 రైతు భరోసా కింద ఇస్తామని నమ్మబలికి వైకాపా ప్రభుత్వం మోసగించిందన్నారు. తిత్లీ తుపాను నష్ట పరిహారం ఇంత వరకు ఇవ్వకపోగా.. రాష్ట్రంలో రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర లభించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెదేపా ప్రభుత్వ హయాంలో రైతు సంక్షేమానికి ఉచితంగా అందించిన వివిధ పథకాలను రద్దు చేశారని ఆరోపించారు. మోసపూరిత మాటలు, అసత్య వాగ్ధానాలు చేస్తున్న ముఖ్యమంత్రిపై సీఐడీ ఎందుకు కేసు పెట్టట్లేదని నిలదీశారు.

ABOUT THE AUTHOR

...view details