ఆంధ్రప్రదేశ్

andhra pradesh

లోకకల్యాణార్థం విజయవాడ దుర్గగుడిలో సూర్యోపాసన సేవ

By

Published : Feb 21, 2021, 6:39 PM IST

విజయవాడ కనకదుర్గ ఆలయంలో నిర్వహిస్తున్న సూర్యోపాసనతో పాటు ఇతర సేవల్లో భక్తులు పాల్గొనేందుకు.. పలు మార్గాల్లో టికెట్లు అందుబాటులో ఉన్నాయని దేవస్థానం అధికారులు తెలిపారు. శ్రీ శార్వరీ నామ సంవత్సరం మాఘ మాసం సందర్భంగా లోకహితార్థం ఆయా కార్యక్రమాలు ఏర్పాటు చేసినట్లు వివరించారు.

suryopasana seva in vijayawada kanakadurga temple
విజయవాడ దుర్గగుడిలో సూర్యోపాసనసేవ

ఈనెల 12 నుంచి మార్చి 13 వరకు మాఘ మాసంలో వచ్చే ఆదివారాలు, రథసప్తమి, ఏకాదశి, పౌర్ణమి రోజుల్లో.. విజయవాడ కనకదుర్గ ఆలయంలో సూర్యోపాసనలు నిర్వహిస్తున్నట్లు దేవస్థాన అధికారులు తెలిపారు. శ్రీ శార్వరి నామ సంవత్సర మాఘ మాసాన్ని పురస్కరించుకుని.. ఆయా కార్యక్రమాలు ఏర్పాటు చేసిన్నట్లు పేర్కొన్నారు.

సూర్యోపాసనలో భాగంగా ఆలయ అర్చకులు.. అరుణ పారాయణ సౌరము, సూర్య నమస్కారములు, సూర్యుని జపాలు నిర్వహించారు. వీటితో పాటు ఇతర సేవల్లో పాల్గొనాలనుకునే భక్తులకు.. దేవస్థానం వెబ్ సైట్ www.kanakadurgamma.org లో, kanakadurgamma మొబైల్ ఆప్​లో, మీ-సేవ కేంద్రాలలో, దేవస్థానం మహామండపం ఏడో అంతస్తులోని ఆర్జిత సేవ కౌంటరులో టికెట్లు అందుబాటులో ఉంటాయని వెల్లడించారు.

TAGGED:

ABOUT THE AUTHOR

...view details