ఆంధ్రప్రదేశ్

andhra pradesh

షర్మిల దీక్షకు.. హైదరాబాద్ పోలీసుల అనుమతి

By

Published : Apr 14, 2021, 6:37 PM IST

హైదరాబాద్​ నగరంలో ఇందిరా పార్కు వద్ద వైఎస్​ షర్మిల గురువారం నిర్వహించ తలపెట్టిన దీక్షకు పోలీసులు అనుమతిచ్చారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు దీక్ష కొనసాగనుంది.

permition to sharmila deeksha in hyderabad
ఇందిరాపార్కు వద్ద షర్మిల దీక్షకు గ్రీన్​సిగ్నల్​

తెలంగాణ యువతకు ఉద్యోగాలు కల్పించాలని కోరుతూ వైఎస్​ షర్మిల గురువారం నిర్వహించనున్న దీక్షకు ఒకరోజు అనుమతి లభించింది. హైదరాబాద్​లోని ఇందిరా పార్కు వద్ద మూడు రోజుల దీక్షకు షర్మిల ప్రతినిధులు పోలీసులను అనుమతి కోరగా.. రేపు ఒక్కరోజు మాత్రమే దీక్ష నిర్వహించుకునేలా అనుమతించారు.

ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు షర్మిల దీక్షకు పోలీసులు పర్మిషన్ ఇచ్చారు. నిరుద్యోగుల కోసం దీక్ష చేస్తానని ఖమ్మం సభలో ఆమె ప్రకటించిన మేరకు.. అనుచరులు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details