ఆంధ్రప్రదేశ్

andhra pradesh

'కార్మికులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే.. వైకాపా నేతలు కోట్లు దండుకుంటున్నారు'

By

Published : Oct 10, 2020, 2:45 PM IST

వైకాపా నేతలపై నారా లోకేశ్ విమర్శలు గుప్పించారు. ఇసుక లేక, ఉపాధి కోల్పోయి కార్మికులు ఆత్మహత్య చేసుకుంటుంటే.. వారు మాత్రం అక్రమంగా కోట్లు దండుకుంటున్నారని విమర్శించారు. వైకాపా నేతల నుంచి పోలీసులకే రక్షణ లేదన్నారు.

nara lokesh
నారా లోకేశ్

నారా లోకేశ్ ట్వీట్స్

వైకాపా ఇసుకాసురులు బరి తెగించారని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ మండిపడ్డారు. ఇసుక దొరక్క, పనుల్లేక పస్తులుండి భవన నిర్మాణ కార్మికులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే.. ఇసుక అక్రమ రవాణా చేస్తూ కోట్లు కొట్టేస్తున్న వైకాపా నేతలు రోడ్ల మీద వీరంగం చేస్తున్నారని ధ్వజమెత్తారు.

పుట్టపర్తి నియోజకవర్గంలో ఎమ్మెల్యే బంధువు దుద్దకుంట సురేందర్ రెడ్డి మద్యం సేవించి రోడ్డు మీద హల్ చల్ చేయటంతో పాటు అడ్డొచ్చిన ఎస్సైపై తిరగబడ్డాడని దుయ్యబట్టారు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ పోస్ట్ పెడితే అరెస్ట్ చెయ్యమని ఒత్తిడి చేస్తున్న కొంతమంది అధికారులకు వైకాపా నేతలు చేస్తున్న అరాచకాలు కనిపించడం లేదా అని నిలదీశారు. వైకాపా నేతల నుంచి పోలీసులకే రక్షణ లేనప్పుడు ఇక ప్రజల పరిస్థితి ఏంటని లోకేశ్ ప్రశ్నించారు.

ABOUT THE AUTHOR

...view details