ఆంధ్రప్రదేశ్

andhra pradesh

RRR: పవన్ ఆ పార్టీతో కలిసే అవకాశాలు కనిపిస్తున్నాయి: ఎంపీ రఘురామ

By

Published : Mar 15, 2022, 4:41 PM IST

పవన్ ఉద్దేశం చూస్తుంటే తెలుగుదేశం పార్టీతో కలిసే అవకాశాలు కనిపిస్తున్నాయని నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు అభిప్రాయపడ్డారు. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలిపోకుండా చూస్తామన్న పవన్ వ్యాఖ్యలను చూస్తే బాధ అనిపించినా.. నిజం చెప్పినందుకు సంతోషించాలన్నారు.

పవన్ ఆ పార్టీతో కలిసే అవకాశాలు కనిపిస్తున్నాయి
పవన్ ఆ పార్టీతో కలిసే అవకాశాలు కనిపిస్తున్నాయి

పవన్ ఆ పార్టీతో కలిసే అవకాశాలు కనిపిస్తున్నాయి

ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలిపోకుండా చూస్తామన్న పవన్ వ్యాఖ్యలను చూస్తే బాధ అనిపించినా.. నిజం చెప్పినందుకు సంతోషించాలని నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు అన్నారు. పవన్ ఉద్దేశం చూస్తుంటే తెలుగుదేశం పార్టీతో కలిసే అవకాశాలు కనిపిస్తున్నాయని ఆయన అభిప్రాయపడ్డారు. జనసేన, భాజపా, తెలుగుదేశం కలిస్తే ప్రజలకు మంచి జరుగుతుందన్న ఉద్దేశంతోనే పవన్ ఆవిధంగా వ్యాఖ్యలు చేసినట్లు అనిపిస్తోందని రఘురామ తెలిపారు.

"వ్యతిరేక ఓట్లు చీల్చనని పవన్‌ చెప్పారు. బలమైన ప్రతిపక్షాలు కలవాలి. ఇప్పటికే భాజపాతో కలిసి ఉన్నారు. పవన్‌ ఉద్దేశం ప్రకారం తెదేపాతో కలవచ్చు. రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం. మూడు పార్టీలు కలిస్తే ప్రజలకు మంచి జరుగుతుందని పవన్‌ ఉద్దేశం."- రఘురామ, నరసాపురం ఎంపీ

ABOUT THE AUTHOR

...view details