ఆంధ్రప్రదేశ్

andhra pradesh

అసమర్థత కప్పిపుచ్చుకోవడానికే అమరావతిపై సీఎం విమర్శలు: కేశినేని నాని

By

Published : Dec 26, 2020, 1:16 PM IST

Updated : Dec 26, 2020, 2:47 PM IST

ఎంపీ నిధులతో నిర్మించిన సీసీ రోడ్డును విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని నాని విజయవాడలో ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం జగన్​పై ఎంపీ మండిపడ్డారు.

Mp Kesineni nani road Opening in vijayawada
సీసీ రోడ్డును ప్రారంభించిన ఎంపీ కేశినేని నాని

విజయవాడ వన్ టౌన్ ఆంజనేయ వాగు కూడలిలో నిర్మించిన సీసీ రోడ్డును విజయవాడ ఎంపీ కేశినేని నాని ప్రారంభించారు. 33 లక్షల రూపాయల పార్లమెంట్ సభ్యుల నిధులతో ఈ రహదారి వేశారు. అనంతరంఆంజనేయ వాగు సెంటర్​లోనే పలు డివిజన్లలో ఆయన పాదయాత్ర చేశారు.

అమరావతి నిర్మాణంలో చేతులెత్తేసిన సీఎం జగన్.. తన అసమర్థత కప్పిపుచ్చుకోవడానికి కల్లబొల్లి మాటలు చెబుతున్నారని మండిపడ్డారు. రాజధాని రైతుల త్యాగాన్ని అవహేళన చేసేలా వ్యాఖ్యలు చేస్తున్నారని ఎంపీ కేశినేని నాని విమర్శించారు. ప్రజల బాగోగులు పట్టించుకోకుండా స్వలాభానికి పని చేస్తున్నారని ఆరోపించారు.

Last Updated : Dec 26, 2020, 2:47 PM IST

ABOUT THE AUTHOR

...view details