ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ఎంపీ కేశినేని నాని తెదేపా వీడుతున్నారని ప్రచారం.. ఖండించిన వర్గీయులు

By

Published : Oct 18, 2021, 4:57 PM IST

ఎంపీ కేశినేని నాని(mp kesineni nani) తెదేపా(tdp)ను వీడుతున్నారంటూ జరుగుతున్న ప్రచారాన్ని.. ఆయన వర్గీయులు ఖండించారు. విజయవాడలోని కేశినేని భవన్​లో ఒకచోట రతన్ టాటాతో ఎంపీ కలిసి ఉన్న ఫొటో ఏర్పాటు చేస్తే.. దానిని తప్పుపట్టడం సరికాదన్నారు.

mp kesineni nani followers condemns false statements that he is going to join other party
ఎంపీ కేశినేని నాని తెదేపాను వీడుతున్నారంటూ ప్రచారం.. ఖండించిన వర్గీయులు

విజయవాడ ఎంపీ కేశినేని నాని(mp kesineni nani) తెదేపా(tdp)ను వీడుతున్నారంటూ జరుగుతున్న ప్రచారాన్ని.. ఆయన వర్గీయులు ఖండించారు. కేశినేని భవన్​(kesineni bhavan)లో ఒకచోట రతన్ టాటా(ratan tata)తో ఎంపీ కలిసి ఉన్న ఫొటో ఏర్పాటు చేస్తే.. దానిని తప్పుపట్టడం సరికాదన్నారు. టాటా ట్రస్ట్ సేవల గుర్తింపులో భాగంగానే.. కేశినేని భవన్​లో ఓ ఫొటో ఏర్పాటు చేసినట్లు.. రతన్ టాటా ట్రస్ట్​తో కలిసి చేసే సేవలు కేశినేని నాని మరింత విస్తరిస్తున్నట్లు వారు వివరించారు.

కార్యాలయంలో మిగిలిన చోట్ల తెదేపా నాయకుల ఫొటోలు, ఫ్లెక్సీలు అలాగే ఉన్నాయని.. పార్లమెంట్ కమిటీ సమావేశాల్లో పాల్గొనేందుకే నాని దిల్లీ వెళ్లినట్లు ఆయన వర్గీయులు స్పష్టతనిచ్చారు.

ABOUT THE AUTHOR

...view details