ఆంధ్రప్రదేశ్

andhra pradesh

'ధైర్యముంటే దిల్లీలో ఆందోళనలు చేయండి' : మంత్రి వెల్లంపల్లి

By

Published : Sep 6, 2021, 4:28 PM IST

వినాయక చవితి ఉత్సవాలపై భాజపా మతరాజకీయాలు చేస్తోందని దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌ ఆరోపించారు. కరోనా కట్టడిలో భాగంగానే ప్రభుత్వం ఈ ఉత్సవాల బహిరంగ నిర్వహణపై ఆంక్షలు విధించినట్లు ఆయన స్పష్టం చేశారు.

Minister Vellampalli Srinivas on BJP protest
మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌

గణేశ్​ ఉత్సవాలపై భాజపా మతరాజకీయాలు చేస్తోంది

రాష్ట్రంలో వినాయక చవితి వేడుకల సందర్భంగా పూజలు చేసుకోవద్దని ఎవరూ చెప్పలేదని.. ఎవరి ఇళ్లలో వారు పూజలు చేసుకోవచ్చని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు అన్నారు. కరోనా కట్టడిలో భాగంగానే ప్రభుత్వం.. వినాయక చవితి ఉత్సవాల బహిరంగ నిర్వహణపై ఆంక్షలు విధించిందని స్పష్టం చేశారు. చవితి ఉత్సవాలపై.. భాజపా మత రాజకీయాలు చేస్తోందని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌ ఆరోపించారు. ప్రతీ విషయాన్ని రాజకీయం చేయడం, మతం రంగు పూయడం సరైన పద్ధతి కాదన్నారు.

గణేశ్​ ఉత్సవాల నిర్వహణపై భాజపా నేతల రాష్ట్రవ్యాప్త ఆందోళనల నేపథ్యంలో తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి జగన్​తో ఆయన చర్చించారు. భాజపా నేతలు విద్వేషాలు రెచ్చగొడితే రాష్ట్ర ప్రభుత్వం చూస్తూ ఊరుకోదని హెచ్చరించారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల మేరకే ఆంక్షలు అమలు చేస్తున్నామని.. భాజపా నేతలకు దమ్ముంటే వెంటనే డిల్లీకి వెళ్లి నిబంధనల్లో మార్పులు చేయించాలన్నారు.

కర్నూలులో భాజపా రాష్ట్ర నేతలు వినాయకుడి విగ్రహాలు పట్టుకొని మత రాజకీయాలు చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల మేరకే ఆంక్షలు అమలు చేస్తున్నాం. కరోనా కట్టడిలో భాగంగానే వినాయక చవితి ఉత్సవాల బహిరంగ నిర్వహణపై ఆంక్షలు విధించాం. భాజపా నేతలు ఆందోళనలు చేయాల్సింది రాష్ట్రంలో కాదు.. దిల్లీలోని ప్రధాని వద్ద... దమ్ముంటే వెంటనే డిల్లీకి వెళ్లి నిబంధనలలో మార్పులు చేయించాలి. కమలం పార్టీ నేతలు విద్వేషాలు రెచ్చగొడితే రాష్ట్ర ప్రభుత్వం చూస్తూ ఊరుకోదు. -వెల్లంపల్లి శ్రీనివాస్‌, దేవాదాయ శాఖ మంత్రి

ఇదీ చదవండి..

bjp protest: కలెక్టరేట్లను ముట్టడిస్తున్న భాజపా నాయకులు.. పలు చోట్ల ఉద్రిక్తత

ABOUT THE AUTHOR

...view details