ఆంధ్రప్రదేశ్

andhra pradesh

PERNI NANI: 'ప్రకాశం బ్యారేజ్​కు భారీగా వరద.. నదిలోకి ఎవరూ వెళ్లొద్దు'

By

Published : Aug 1, 2021, 5:24 PM IST

ప్రకాశం బ్యారెజ్​కు భారీగా వరద చేరుతోందని మంత్రి పేర్నినాని తెలిపారు. కృష్ణానదీ తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మంత్రి సూచించారు.

మంత్రి పేర్నినాని
మంత్రి పేర్నినాని

ప్రకాశం బ్యారేజ్​కు భారీగా వరదనీరు వస్తోందని మంత్రి పేర్ని నాని తెలిపారు. శ్రీశైలం, పులిచింతల నుంచి ప్రకాశం బ్యారెజ్​కు భారీగా వరద నీరు వస్తుందని వెల్లడించిన మంత్రి.. సాయంత్రానికి లక్ష క్యూసెక్కులు ప్రకాశం బ్యారేజ్​కు చేరుకునే అవకాశం ఉందని చెప్పారు.

రేపటికి.. 5 లక్షల క్యూసెక్కుల నీరు వస్తుందని మంత్రి అంచనా వేస్తున్నట్లు మంత్రి తెలిపారు. కృష్ణా నదీ తీరప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పేర్ని నాని సూచించారు. ప్రకాశం బ్యారేజ్ దిగువన ఎవరూ నదీలో దిగవద్దని మంత్రి స్పష్టం చేశారు.

ABOUT THE AUTHOR

...view details