ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ఇళ్ల పథకాన్ని ప్రతిపక్షాలు అడ్డుకోవడం బాధాకరం: మంత్రి వెల్లంపల్లి

By

Published : Oct 9, 2021, 5:18 PM IST

విజయవాడలోని ఎస్ఎస్ కన్వెన్షన్‌ హాలులో క్రెడాయ్‌ ప్రాపర్టీ షోను మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు ప్రారంభించారు. ఈసందర్భంగా మాట్లాడిన ఆయన.. ప్రతి ఒక్కరికి ఇళ్లు ఉండాలనే కోరికతో...సీఎం జగన్ ముందుకు వెళ్తుంటే...ప్రతిపక్ష నాయకులు కోర్టుకు వెళ్లి స్టేలు తీసుకురావటం బాధాకరమన్నారు.

మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు
మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు

ప్రతి ఒక్కరికీ ఇళ్లు ఉండాలనే కోరికతో.. సీఎం జగన్(CM JAGAN) ముందుకు వెళ్తుంటే.. ప్రతిపక్ష పార్టీ నాయకులు కోర్టుకు వెళ్లి స్టేలు తీసుకురావటం బాధాకరమని... మంత్రి వెల్లంపల్లి(vellampally) శ్రీనివాసరావు అన్నారు. విజయవాడలోని ఎస్.ఎస్ కన్వెన్షన్‌ హాలులో క్రెడాయ్‌ ప్రాపర్టీ షోను ప్రారంభించిన మంత్రి.. ప్రతి ఒక్కరూ సొంతింటి కలను నెరవేర్చుకోవాలని ఆకాంక్షించారు. హైకోర్టు తీర్పుపై స్పందించిన మంత్రి.. తమవైపు న్యాయం ఉందని, తప్పనిసరిగా గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. హైకోర్టు తీర్పుపై అప్పీలుకు వెళ్తామని స్పష్టం చేశారు.

క్రెడాయి ప్రాపర్టీ షోను ప్రారంభిస్తున్న మంత్రి వెల్లంపల్లి

ABOUT THE AUTHOR

...view details