ఆంధ్రప్రదేశ్

andhra pradesh

రాష్ట్రంలో తాజాగా 733 కరోనా కేసులు, ఆరుగురు మృతి

By

Published : Nov 27, 2020, 6:56 PM IST

గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 733 కరోనా కేసులు నమోదయ్యాయి. ఆరుగురు మహమ్మారి బారిన పడి చనిపోయారు. మొత్తం బాధితుల సంఖ్య 8,66,438కి చేరింది.

రాష్ట్రంలో తాజాగా 733 కరోనా కేసులు, ఆరుగురు మృతి
రాష్ట్రంలో తాజాగా 733 కరోనా కేసులు, ఆరుగురు మృతి

రాష్ట్రంలో కొత్తగా 57 వేల 752 కరోనా పరీక్షలు చేయగా... 733 మందికి పాజిటివ్‌గా నిర్ధరణ అయినట్లు రాష్ట్ర వైద్యఆరోగ్య శాఖ వెల్లడించింది. మొత్తం కరోనా బాధితుల సంఖ్య 8 లక్షల 66 వేల 438కి చేరింది. రాష్ట్రంలో ఒక్కరోజులోనే ఆరుగురు మరణించగా... మొత్తం మరణాల సంఖ్య 6 వేల 976కి పెరిగింది. కొత్తగా 1,205 మంది బాధితులు కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారు. ప్రస్తుతం 12 వేల 137 యాక్టివ్‌ కేసులు ఉన్నాయని వైద్యారోగ్యశాఖ వెల్లడించింది.

ABOUT THE AUTHOR

...view details