ఆంధ్రప్రదేశ్

andhra pradesh

'ప్రభుత్వ శాఖల్లో ఖాళీలపై శ్వేతపత్రం విడుదల చేయాలి'

By

Published : Jul 6, 2021, 4:22 PM IST

రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వశాఖల్లో ఉన్న ఖాళీలపై శ్వేత పత్రం విడుదల చేయాలని 'కుల వివక్ష పోరాట సమితి' ఆధ్వర్యంలో.. విజయవాడలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఎస్సీ, ఎస్టీ బ్యాక్​లాగ్ పోస్టులను భర్తీ చేయాలని, రాష్ట్ర వ్యాప్తంగా స్టడీ సర్కిళ్లను ఏర్పాటు చేయాలని వారు డిమాండ్ చేశారు.

round table meeting AT VIJAYAWADA
ప్రభుత్వ శాఖల్లో ఖాళీలపై స్వేతపత్రం విడుదల చేయాలి

రాష్ట్రంలో ఖాళీగా ఉన్న అన్ని రకాల ఎస్సీ, ఎస్టీ బ్యాక్​లాగ్ పోస్టులను భర్తీ చేయాలని, వయోపరిమితిని 50 సంవత్సరాలకు పెంచాలని, అంబేద్కర్ ఏపీ స్టడీ సర్కిల్(study circles) సెంటర్లను జిల్లాకు ఒకటి ప్రారంభించాలని డిమాండ్ చేస్తూ.. కుల వివక్ష పోరాట సమితి ఆధ్వర్యంలో విజయవాడలో రౌండ్ టేబుల్(round table meeting) సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన శాసనమండలి సభ్యులు కెఎస్. లక్ష్మణరావు మాట్లాడుతూ.. తక్షణమే ప్రభుత్వం అన్ని శాఖల్లోని ఖాళీలపై శ్వేత పత్రం(white paper) విడుదల చేయాలన్నారు.

అన్ని రకాల బ్యాక్లాగ్ పోస్టులను భర్తీ చేయాలని తీర్మానించారు. స్టడీ సర్కిళ్ల ఏర్పాటుపై.. రాష్ట్ర ముఖ్యమంత్రి, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి, ప్రధాన కార్యదర్శి, కమిషనర్లను కలిసేందుకు వారు తీర్మానం చేశారు. అన్ని శాఖల్లోని ఖాళీలను భర్తీ చేసేలా ఉద్యోగ క్యాలెండర్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. లేకుంటే రానున్నరోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేపడతామని హెచ్చరించారు.

ABOUT THE AUTHOR

...view details