ఆంధ్రప్రదేశ్

andhra pradesh

SECI: విమర్శలు వస్తున్నా.. సెకితో ఒప్పందంపై ముందుకే

By

Published : Dec 17, 2021, 7:00 AM IST

SECI: సోలార్‌ ఎనర్జీ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (సెకి) నుంచి సౌర విద్యుత్‌ తీసుకోవాలన్న ప్రతిపాదనపై అన్ని వర్గాల నుంచి విమర్శలు వస్తున్నా ప్రభుత్వం ముందుకే అడుగేసింది. మార్కెట్‌లో తక్కువ ధరకు విద్యుత్తు దొరుకుతున్నప్పుడు అధిక ధర వెచ్చించి కొనడమేమిటని నిపుణులు ఎంత మొత్తుకున్నా లక్ష్యపెట్టడం లేదు.

సెకితో ఒప్పందంపై ముందుకే
సెకితో ఒప్పందంపై ముందుకే

Govt with SECI: సోలార్‌ ఎనర్జీ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (సెకి) నుంచి సౌర విద్యుత్‌ తీసుకోవాలన్న ప్రతిపాదనపై అన్ని వర్గాల నుంచి విమర్శలు వస్తున్నా ప్రభుత్వం ముందుకే అడుగేసింది. మార్కెట్‌లో తక్కువ ధరకు విద్యుత్తు దొరుకుతున్నప్పుడు అధిక ధర వెచ్చించి కొనడమేమిటని నిపుణులు ఎంత మొత్తుకున్నా లక్ష్యపెట్టడం లేదు. వివిధ కారణాలతో సౌర విద్యుత్‌ ధరలు భవిష్యత్తులో భారీగా తగ్గుతాయన్నా పట్టించుకోలేదు. యూనిట్‌ రూ.2.49 చొప్పున 7వేల మెగావాట్ల సౌర విద్యుత్‌ తీసుకోవడానికి టెండర్లు.. రివర్స్‌ టెండరింగ్‌ లేకుండానే అంగీకరిస్తూ ఒప్పందంపై ఇటీవల సంతకాలు చేసింది.

ఒప్పందం అమల్లోకి వచ్చినప్పటి నుంచి ఏటా 1,700 కోట్ల యూనిట్ల చొప్పున... 25 ఏళ్లలో రూ.1.05 లక్షల కోట్ల విలువైన విద్యుత్‌ను ప్రభుత్వం తీసుకోనుంది. ఈ ఒప్పందంపై ప్రజాభిప్రాయ సేకరణ జరిపి, టారిఫ్‌ను నిర్దేశించడానికి వీలుగా కేంద్ర విద్యుత్‌ నియంత్రణ మండలిలో (సీఈఆర్‌సీ) సెకి, రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధులు పిటిషన్‌ దాఖలు చేశారు. నిపుణులు, ప్రజా సంఘాల నుంచి వ్యతిరేకత వస్తుందన్న ఉద్దేశంతో ఒప్పందం వివరాలను అధికారులు రహస్యంగా ఉంచారు. ఇతర రాష్ట్రాల్లో ఏర్పాటు చేసిన ప్రాజెక్టుల నుంచి విద్యుత్తు తీసుకునేటప్పుడు అంతర్రాష్ట విద్యుత్‌ ప్రసార ఛార్జీలు, ప్రసార నష్టాల్లో సుమారు 3 శాతం సెకి భరిస్తుందని ఒక అధికారి తెలిపారు. ఒప్పందంపై సంతకాలు చేసినంత మాత్రాన తప్పనిసరిగా పీపీఏ కుదుర్చుకోవాల్సిన అవసరం లేదని చెప్పారు.

ఇదీ చదవండి:

orr: ఓఆర్ఆర్​కు ఉరి!...రాష్ట్ర అభివృద్దికి విఘాతం

ABOUT THE AUTHOR

...view details