ఆంధ్రప్రదేశ్

andhra pradesh

స్వర్ణ ప్యాలెస్ ప్రమాదంపై ఆధారాలు సేకరించిన ఫోరెన్సిక్ నిపుణులు

By

Published : Aug 12, 2020, 7:37 PM IST

స్వర్ణప్యాలెస్ అగ్నిప్రమాదంపై విచారణ కొనసాగుతుంది. బుధవారం రాష్ట్ర ఫోరెన్సిక్ నిపుణులు, హైదరాబాద్ నుంచి వచ్చిన మరో బృందం ప్రమాదస్థలిని పరిశీలించారు. ప్రమాదానికి సంబంధించి కొన్ని శాంపిల్స్ సేకరించారు. ఈ ఘటనపై మొత్తం 8 బృందాలు దర్యాప్తు చేస్తున్నాయని పోలీసులు తెలిపారు.

స్వర్ణ ప్యాలెస్ ప్రమాదంపై ఎఫ్.ఎస్.ఎల్ రాష్ట్ర కమిటీ దర్యాప్తు
స్వర్ణ ప్యాలెస్ ప్రమాదంపై ఎఫ్.ఎస్.ఎల్ రాష్ట్ర కమిటీ దర్యాప్తు

స్వర్ణప్యాలెస్ అగ్నిప్రమాదం ఘటనపై నాలుగోరోజు విచారణ కొనసాగింది. రాష్ట్ర ఫోరెన్సిక్ నిపుణులుతో పాటు హైదరాబాద్ నుంచి వచ్చిన మరో బృందం సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. ప్రమాదస్థలి నుంచి కొన్ని శాంపిల్స్ ను సేకరించారు. విద్యుత్, అగ్నిమాపక శాఖ ఉన్నతాధికారులు కూడా ఘటనాస్థలాన్ని పరిశీలించారు. ఇప్పటికే ఈ కేసులో ముగ్గుర్ని అరెస్ట్ చేసిన పోలీసులు... ఆసుపత్రి, హోటల్ కు సంబంధించిన వారిని విచారించనున్నారు.

మొత్తం 8 బృందాలు ఈ కేసును దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు చెబుతున్నారు. ప్రస్తుతం ఈ ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం, జిల్లా కలెక్టర్ నియమించిన కమిటీలు అన్ని కోణాల్లో విచారించి నివేదికను తయారుచేస్తున్నాయి. కమిటీ నివేదికలు ఇవాళ ప్రభుత్వానికి అందించే అవకాశం ఉంది.

ఇదీ చదవండి : చేయూత కాదు.. చేతి వాటం పథకం: లోకేశ్

ABOUT THE AUTHOR

...view details