ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Flood Damages Estimation: వరదలతో రూ. 6054 కోట్లు నష్టం.. ప్రాథమిక అంచనాలు విడుదల

By

Published : Nov 25, 2021, 5:02 AM IST

Updated : Nov 25, 2021, 11:51 AM IST

రాష్ట్రంలో భారీ వర్షాల కారణంగా మొత్తం లక్షా 42 వేల ఎకరాల్లో పంట నష్టం జరిగినట్లు(Flood Damages Estimation) అధికారులు తెలిపారు. వాటి మొత్తం నష్టం అంచనా రూ.6,054 కోట్లుగా పేర్కొంటూ.. అధికారులు ప్రాథమిక అంచనాలు విడుదల చేశారు.

Flood Damages Estimation
వరదలకు రూ. 6వేల 54 కోట్లు నష్టం

Flood Damages Estimation in ap: రాష్ట్రంలో వరద నష్టంపై అధికారులు ప్రాథమిక అంచనాలు విడుదల చేశారు. భారీ వర్షాల కారణంగా మొత్తం లక్షా 42 వేల ఎకరాల్లో పంట నష్టం జరగగా.. వాటి విలువ రూ. 6వేల 54 కోట్లుగా(6.54 crore loss due to floods in andhra pradesh) తేల్చారు.

ఇందులో రహదారుల దెబ్బతినటం వల్ల రూ. 17 వందల 56 కోట్లు నష్టపోయినట్లు తెలిపారు. చెక్ డ్యాములు, చెరువులు, కాల్వలకు గండి పడటంతో.... సాగునీటి శాఖకు జరిగిన నష్టం రూ. 556 కోట్లుగా నిర్ధారించారు. వ్యవసాయ రంగంలో రూ. 13 వందల 53 కోట్లుగా ఉందని అంచనా వేశారు. పంచాయతీ రాజ్, విద్యుత్ శాఖలకు మరో రూ. 2 వేల కోట్ల మేర నష్టం వాటిల్లిందని అంచనా(release preliminary estimates of flood damage at ap) వేస్తున్నారు.

Last Updated : Nov 25, 2021, 11:51 AM IST

ABOUT THE AUTHOR

...view details