ఆంధ్రప్రదేశ్

andhra pradesh

దుర్గమ్మ రూపంలో అమ్మవారి దర్శనం... తెప్పోత్సవంపై సందిగ్ధత

By

Published : Oct 3, 2022, 8:01 PM IST

Indrakiladri: శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అమ్మవారు.. దుర్గాదేవిగా దర్శనమిచ్చారు. మూలానక్షత్రం రోజున దాదాపు 2 లక్షల మంది భక్తులు దర్శించుకున్నారని అధికారులు అంచనా వేశారు. దసరా ఉత్సవాల ముగింపు సందర్భంగా నిర్వహించే తెప్పోత్సవంపై సందిగ్ధం కొనసాగుతోంది.

durga devi
దుర్గాదేవిగా అమ్మవారి దర్శనం

దుర్గాదేవిగా అమ్మవారి దర్శనం

Indrakeeladri: విజయవాడ ఇంద్రకీలాద్రి పరిసరాలు జై భవానీ నామస్మరణతో మార్మోగుతున్నాయి. శరన్నవరాత్రి ఉత్సవాలు.. చివరి దశకు చేరినవేళ భక్తుల తాకిడి ఎక్కువైంది. మూలా నక్షత్రం దర్శనాలు ఆదివారం పొద్దుపోయే వరకు జరిగినా.. సోమవారం తెల్లవారుజామున యథావిధిగా మూడు గంటల నుంచే భక్తులను దర్శనానికి అనుమతించారు. ఉత్సవాల్లో భాగంగా దుర్గాదేవిగా దర్శనమిచ్చారు. ఎర్రని వస్త్రం, మణులు పొదిగిన కిరీటం ధరించి.. సింహ వాహనాన్ని అధిరోహించి, ఎనిమిది చేతులతో కత్తి, డాలు, గద, శంఖం, కలశం, త్రిశూలం, చక్రం, ధనుర్భాణాలు ధరించి సర్వశత్రు సంహారక అవతారంలో దర్శనమిచ్చారు. హైకోర్టు, ఇతర కోర్టుల న్యాయమూర్తులు, సీనియర్‌ ఐఏఎస్‌, ఐపీఎస్‌ అధికారులు, పోలీసు ఉన్నతాధికారులు, మాజీ మంత్రి గాదె వెంకటరెడ్డి, ఎన్టీఆర్‌ జిల్లా కలెక్టరు ఢిల్లీరావు, సినీనటి హేమ, అమ్మవారిని దర్శించుకున్నారు.

ఉత్సవాల చివరి రోజున కనకదుర్గమ్మకు కృష్ణానదిలో హంసవాహన సేవ నిర్వహణపై అధికార యంత్రాంగం తర్జనభర్జన పడుతోంది. పులిచింతల నుంచి ప్రకాశం బ్యారేజీకి లక్ష క్యూసెక్కులకు మించి వరదనీరు వస్తున్నందున నదీవిహారాన్ని నిలిపివేసి-దుర్గాఘాట్‌ వద్ద తెప్పపై ఉత్సవమూర్తులను ఉంచి పూజాధికాలు పూర్తి చేయించాలని అధికారులు యోచిస్తున్నారు.

మూలానక్షత్రం రోజున రెండున్నర లక్షల మంది వరకు భక్తులు దర్శనం చేసుకున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. ఉత్సవాల్లో కీలకమైన మూలానక్షత్ర దర్శనాలు ప్రశాంతంగా సజావుగా పూర్తయ్యేందుకు సహకరించిన అందరికీ దేవాదాయశాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ కృతజ్ఞతలు తెలిపారు. ఉత్సవాల చివరి రోజున కనకదుర్గమ్మ కృష్ణానదిలో నిర్వహించే హంసవాహనసేవ నిర్వహణపై అధికార యంత్రాంగం తర్జనభర్జన పడుతోంది. జలవనరులశాఖ-ఇతర శాఖల అధికారులతో సమన్వయ సమావేశంలో చర్చించి ఓ నిర్ణయం తీసుకోనున్నారు.

పులిచింతల నుంచి ప్రకాశం బ్యారేజీకి లక్ష క్యూసెక్కులకు మించి వరద నీరు వస్తున్నందున నది విహారాన్ని నిలిపివేసి దుర్గాఘాట్‌ వద్ద తెప్పపై ఉత్సవమూర్తులను ఉంచి పూజలు పూర్తి చేయించాలని అధికారులు యోచిస్తున్నారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details