ఆంధ్రప్రదేశ్

andhra pradesh

LOKESH COMMENTS: 'వైకాపా నేతలు తాలిబన్ల తాతలు'

By

Published : Sep 2, 2021, 10:45 PM IST

వైకాపా నేతల్ని తాలిబన్లతో పోల్చారు తెదేపా ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్​. తాలిబన్లు న‌ల్లమందు మాత్రమే పండిస్తే.. వైకాపాబ‌న్ల పాలనలో సారా త‌యారీ నుంచి మొద‌లై, నాటు తుపాకుల త‌యారీ ఉపాధి కేంద్రంగా రాష్ట్రాన్ని మార్చేశారని మండిపడ్డారు.

నారా లోకేశ్​
నారా లోకేశ్​

తాలిబ‌న్ల తాత‌ల్లా వైకాపాబన్లు త‌యార‌య్యారని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ దుయ్యబట్టారు. తాలిబన్లు న‌ల్లమందు మాత్రమే పండిస్తే.. వైకాపాబ‌న్ల పాలనలో సారా త‌యారీ నుంచి మొద‌లై, నాటు తుపాకుల త‌యారీ ఉపాధి కేంద్రంగా రాష్ట్రాన్ని మార్చేశారని మండిపడ్డారు.

చంద్రబాబు నెల‌కొల్పిన‌ మెడ్‌టెక్‌ జోన్‌లో క‌రోనా కిట్లు మేక్ ఇన్ ఆంధ్రా అయితే, జ‌గ‌న్ విధ్వంస‌కర పాల‌న‌లో ఫ్యాక్షన్ కిట్లు మేడ్ ఇన్ ఆంధ్రగా మారాయని విమర్శించారు. రాజకీయ లబ్ధి కోసమే దిశ చట్టాన్ని ఇంతకాలం వాడుకున్నట్లు స్వయంగా హోంమంత్రే అంగీకరించారని లోకేశ్ ట్విట్టర్​లో ఓ వీడియోను విడుదల చేశారు. హోంమంత్రి హక్కుల్ని హరించిన షాడో హోంమంత్రి ఆమెను ఇంటికే పరిమితం చెయ్యడంతో నిజాలు బయటపెట్టడం అభినందనీయమన్నారు. దిశ చట్టం లేదని ఒప్పుకున్నందున మరి మహిళలకు భద్రత ఎలాగని నిలదీశారు. సీఎం చెప్పిన 21 రోజుల్లో ఇక 6 పనిదినాలు మాత్రమే మిగిలాయని.. రమ్యని కిరాతకంగా చంపిన వాడికి ఉరేయ్యాలని అన్నారు.

ఇదీ చదవండి:Curfew Extended: చవితి ఉత్సవాలు ఇళ్లకే పరిమితం..రాత్రి కర్ఫ్యూ మరికొంత కాలం పొడిగింపు

ABOUT THE AUTHOR

...view details