ఆంధ్రప్రదేశ్

andhra pradesh

CM REVIEW: కరెంట్​ కోతలు లేకుండా చర్యలు చేపట్టాలి: సీఎం జగన్

By

Published : Oct 14, 2021, 6:42 PM IST

CM POWER REVIEW
CM POWER REVIEW

కరెంటు కోతలు లేకుండా అవసరమైన అన్ని ముందస్తు చర్యలు తీసుకోవాలని సీఎం జగన్ కరెంటుపై నిర్వహించిన సమీక్షలో ఆదేశించారు. సంబంధిత శాఖలతో సమన్వయం చేసుకుంటూ సంక్షోభం నుంచి ముందుకు వెళ్లాలని సూచించారు.

రాష్ట్రంలో ఎక్కడా కరెంటు కోతలు లేకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ముఖ్యమంత్రి జగన్ ఆదేశించారు. అందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని కరెంటు పరిస్థితులపై అధికారులతో జరిపిన సమీక్షలో(cm jagan review on power sector with officials) సూచించారు. వివిధ థర్మల్‌ కేంద్రాల నుంచి కరెంటు ఉత్పత్తి, బొగ్గు నిల్వలపై సీఎం ఆరా తీశారు. థర్మల్‌ కేంద్రాలను పూర్తిస్థాయి సామర్థ్యంతో నడిపించడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు.

నిధులకు ఇబ్బంది లేదు..

దేశంలో బొగ్గు నిల్వలు ఎక్కడ ఉన్నా వాటిని తెప్పించుకోవడానికి అన్ని రకాల చర్యలు తీసుకోవాలన్నారు. అవసరమైన బొగ్గు కొనుగోలు చేయాలన్న సీఎం.. అందుకు నిధుల కొరత లేదని స్పష్టం చేశారు. ఇప్పుడున్న థర్మల్‌ కేంద్రాల్లో ఉత్పత్తిని ప్లాంట్ల సామర్థ్యం మేరకు పెంచాలని సూచించారు. కృష్ణపట్నం, వీటీపీఎస్​లో ఉన్న కొత్త యూనిట్లలో వెంటనే ఉత్పత్తి ప్రారంభించడం ద్వారా 1600 మెగావాట్ల విద్యుత్‌ను అందుబాటులోకి తీసుకురావాలని ఆదేశించారు. సింగరేణి సంస్థతో కూడా సమన్వయం చేసుకుని అవసరాల మేరకు బొగ్గు తెప్పించుకోవాలన్నారు. కేంద్రంలో సంబంధిత మంత్రిత్వశాఖలు, ఏజెన్సీలతో నిరంతరం సమన్వయం చేసుకోవాలని.. ఎక్కడా విద్యుత్ కోతలు లేకుండా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.

ఇదీ చదవండి:

అలాగైతే.. రాష్ట్ర ప్రజలు డీజీపీకి నోటీసులివ్వాలి: వర్ల రామయ్య

ABOUT THE AUTHOR

...view details