ఆంధ్రప్రదేశ్

andhra pradesh

'అక్కడ.. ఐసీఎంఆర్​ పరిశోధన కేంద్రాన్ని ఏర్పాటు చేయాలి'

By

Published : Oct 6, 2022, 7:55 PM IST

CBN LETTER : ఎ.కొండూరులో కిడ్నీ సమస్యలపై ఐసీఎంఆర్​ పరిశోధన కేంద్రాన్ని ఏర్పాటు చెయ్యాలని డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ హెల్త్ రీసెర్చ్‌ సెక్రటరీకి.. చంద్రబాబు లేఖ రాశారు. పెద్ద సంఖ్యలో ప్రజలు మూత్రపిండ సమస్యల బారిన పడుతున్నారని.. లేఖలో ప్రస్తావించారు.

CBN LETTER TO DEPARTMENT OF HEALTH SECRETARY
CBN LETTER TO DEPARTMENT OF HEALTH SECRETARY

CBN LETTER TO DEPARTMENT OF HEALTH SECRETARY : ఎన్టీఆర్‌ జిల్లా ఎ.కొండూరు మండలంలో.. కిడ్నీ సమస్యలపై ఐసీఎంఆర్​ పరిశోధన కేంద్రాన్ని ఏర్పాటు చెయ్యాలని డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ హెల్త్ రీసెర్చ్‌ సెక్రటరీకి.. తెలుగుదేశం అధినేత చంద్రబాబు లేఖ రాశారు. ఎ.కొండూరు మండలంలో పెద్ద సంఖ్యలో ప్రజలు మూత్రపిండ సమస్యల బారిన పడుతున్నారని.. లేఖలో ప్రస్తావించారు. దీనివల్ల ఆ ప్రాంతంలోని గిరిజన, దళిత, వెనుకబడిన వర్గాల ప్రజలు తీవ్ర అనారోగ్యం పాలవుతున్నారని.. పేర్కొన్నారు. ఐసీఎంఆర్​ ఒక పరిశోధనా బృందాన్ని పంపి క్షేత్రస్థాయిలో పరిశోధన చేయాలని సూచించారు. పెరిగిన సమస్య తీవ్రత దృష్ట్యా.. సమగ్ర పరిశోధనలు చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ప్రజల ప్రాణాలు తీస్తున్న కిడ్నీ సమస్యకు పరిష్కారం చూపాలని కోరారు.

ABOUT THE AUTHOR

...view details