ఆంధ్రప్రదేశ్

andhra pradesh

సాయం అందించాల్సిన నిధులు మళ్లించడమేంటి?: చంద్రబాబు

By

Published : Jul 18, 2022, 4:34 PM IST

CBN fires on YSRCP: కొవిడ్ బాధితులకు సాయంగా అందాల్సిన నిధులను దారి మళ్లించడమేంటని తెదేపా అధినేత చంద్రబాబు నిలదీశారు. దారి మళ్లించిన నిధులను వెంటనే ఎస్డీఆర్​ఎఫ్​ ఖాతాలో జమ చెయ్యాలని.. సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలు జగన్ రెడ్డి పాలనకు చెంపపెట్టు అని అన్నారు.

chandrababu fires on ysrcp government
వైకాపా ప్రభుత్వంపై చంద్రబాబు ఆగ్రహం

CBN fires on YSRCP: కొవిడ్ విపత్తు నిధులను దారి మళ్లించడం మానవత్వం లేని జగన్ పాలనకు నిదర్శనమని.. తెదేపా అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. నిబంధనలకు విరుద్ధంగా రాష్ట్ర ప్రభుత్వం రూ.1100 కోట్ల కొవిడ్ విపత్తు నిధులను దారి మళ్లించడాన్ని సుప్రీంకోర్టు తీవ్రంగా తప్పుపట్టిందన్నారు. దారి మళ్లించిన నిధులను వెంటనే ఎస్డీఆర్​ఎఫ్​ ఖాతాలో జమ చెయ్యాలని.. సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలు జగన్ రెడ్డి ఇష్టానుసార పాలనకు చెంపపెట్టులాంటిదన్నారు.

తప్పులు చేయటమే కాకుండా, వాటిని సమర్థించుకోవడం కోసం వైకాపా కొత్త తప్పులు చేస్తోందని మండిపడ్డారు. కొవిడ్ బాధితులకు సాయంగా అందాల్సిన నిధులను దారి మళ్లించడమేంటని నిలదీశారు. విపత్తులు వచ్చినప్పుడు అదనపు కేటాయింపులతో ప్రజలకు సాయం అందించాల్సిన రాష్ట్ర ప్రభుత్వం.. ఇలా నిధులు మళ్లించి పబ్బం గడుపుకోవడం బాధితులకు అన్యాయం చెయ్యడమేనని విమర్శించారు.

కరోనా పరిహారం అందలేదని ఎవరైనా ఫిర్యాదు చేస్తే.. నాలుగు వారాల్లోగా ఫిర్యాదు పరిష్కరించాలన్న సుప్రీంకోర్టు ఆదేశాలను రాష్ట్ర ప్రభుత్వం సాకులు చెప్పకుండా అమలు చెయ్యాలన్నారు. కరోనా కారణంగా చిన్నాభిన్నమైన బాధిత కుటుంబాలను ఇప్పటికైనా ఆదుకోవాలని డిమాండ్‌ చేశారు.

ఇవీ చూడండి:

ABOUT THE AUTHOR

...view details