ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

తెదేపా 40వ ఆవిర్భావ దినోత్సవం.. చంద్రబాబు, లోకేశ్ శుభాకాంక్షలు

తెలుగుదేశంపార్టీ 40వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా.. పార్టీ అధినేత చంద్రబాబు, జాతీయ ప్రధాన కార్యదర్శ లోకేశ్.. నాయకులు, కార్యకర్తలకు శుభాకాంక్షలు తెలిపారు. తెలుగువారు అభివృద్ధి పథంలో దూసుకుపోవాలన్న ఎన్టీఆర్ ఆశయాన్ని కలసికట్టుగా సాధిద్దామని వారు ట్విట్టర్ ద్వారా పిలుపునిచ్చారు.‌

chandrababu, lokesh
చంద్రబాబు, లోకేశ్

By

Published : Mar 29, 2021, 10:03 AM IST

తెలుగుదేశం వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా నేతలు, కార్యకర్తలు, అభిమానులకు.. చంద్రబాబు శుభాకాంక్షలు చెప్పారు. కందుకూరి వీరేశలింగం, గురజాడ అప్పారావు, పొట్టి శ్రీరాములు, అంబేడ్కర్ వంటి మహనీయుల స్ఫూర్తితో తెలుగుదేశం పార్టీని ఎన్టీఆర్ స్థాపించారని గుర్తుచేశారు. తెలుగువారంతా ఆత్మగౌరవంతో జీవించాలని, తెలుగునేల ఘనతను ప్రపంచం నలుదిక్కులా చాటాలని తపించారని చంద్రబాబు అన్నారు. తెలుగువారు అభివృద్ధి పథంలో దూసుకుపోవాలన్న ఎన్టీఆర్ ఆశయాన్ని కలసికట్టుగా సాధిద్దామన్నారు. రామరాజ్యాన్ని అందించే వరకు విశ్రమించరాదని.. ఇందుకోసం వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ప్రతిజ్ఞ తీసుకుందామని శ్రేణులకు పిలుపునిచ్చారు.

ప్రజాభిమానమే తెదేపా బలం: లోకేశ్

గడిచిన నాలుగు దశాబ్దాలుగా చెక్కుచెదరని ప్రజాభిమానంతో కొనసాగుతున్న తెదేపా బలం కార్యకర్తలు.. నాయకులేనని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ పేర్కొన్నారు. తెలుగుజాతి ఆత్మగౌరవ నినాదంతో బడుగు, బలహీనవర్గాలకు అండగా నిలిచేందుకు ఎన్టీఆర్‌ స్థాపించిన తెదేపా 40వ ఆవిర్భావ దినోత్సవం చేసుకోవడం ఆనందనీయమని తెలిపారు. తెదేపా ఒక రాజకీయ పార్టీగా కంటే కోట్ల మందితో కూడిన అతి పెద్ద ఉమ్మడి తెలుగు కుటుంబంగా అందరితో ఆత్మీయానుబంధం ముడి వేసుకుందని పేర్కొన్నారు. క్రమశిక్షణ కలిగిన కార్యకర్తలు, సుశిక్షితులైన నాయకులున్న తెదేపా.. అధినేత చంద్రబాబు నేతృత్వంలో రాష్ట్ర ప్రగతికి, ప్రజా సంక్షేమానికి ఎనలేని కృషి చేస్తూనే ఉందని వివరించారు.

దేశంలో కార్యకర్తల సంక్షేమం కోసమే ప్రత్యేకంగా ఓ విభాగం పనిచేస్తున్న ఏకైక పార్టీ తెదేపాయే. అధికారంలో ఉన్నా, లేకున్నా పార్టీ కోసం పనిచేస్తున్న కుటుంబసభ్యులందరి సంక్షేమానికీ పాటుపడుతున్నాం. ప్రమాదబీమా, విద్యాసాయం, పెళ్లి కానుక వంటి ఎన్నో సౌకర్యాలు అందిస్తున్నాం. కష్టపడి పనిచేస్తున్న ప్రతి ఒక్కరినీ గుర్తించి తగిన రీతిలో గౌరవిస్తాం. పేదలకు అండగా తెదేపా జెండా పట్టుకున్న క్యాడర్‌, లీడర్ల భవిష్యత్తుకు భరోసానిస్తాం’ అని లోకేశ్‌ పేర్కొన్నారు.

ఇదీ చదవండి:

రాష్ట్రానికి పవన్ కల్యాణ్ అధిపతి కావాలి: సోము వీర్రాజు

ABOUT THE AUTHOR

...view details