ఆంధ్రప్రదేశ్

andhra pradesh

'కిసాన్ క్రెడిట్ కార్డు రుణాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలి'

By

Published : Oct 31, 2019, 10:23 AM IST

రైతుల సంక్షేమమే తమ ప్రభుత్వ ధ్యేయమని కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ మంత్రి పురుషోత్తం రూపాల అన్నారు. విజయవాడలో పర్యటించిన ఆయన... అన్నదాతలు ఆర్థికంగా వృద్ధి చెందేలా పలు పథకాలను అమలు చేస్తున్నామన్నారు.

పురుషోత్తం రూపాల

పురుషోత్తం రూపాల

రాష్ట్రంలోని సన్న, చిన్నకారు రైతులు భూమి తనఖా లేకుండా లక్షన్నర రూపాయల వరకు బ్యాంకుల నుంచి కిసాన్‌ క్రెడిట్‌ కార్డు ద్వారా రుణం పొందే అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని.. కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ సహాయ మంత్రి పురుషోత్తం రూపాల సూచించారు. విజయవాడలో మాట్లాడిన ఆయన.. భూమిపై హక్కు పత్రం, ఆధార్‌కార్డు లేదా ఓటరు గుర్తింపు కార్డు, పాస్‌పోర్టు ఫోటోతో సంబంధిత రైతుకు రుణం అందజేయాలని కేంద్ర ప్రభుత్వం బ్యాంకులను ఆదేశించిందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం సేంద్రీయ వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తోందని చెప్పారు.

రైతులకు మేలు చేకూర్చేందుకు భాజపా ప్రభుత్వం సానుకూల నిర్ణయాలు తీసుకుంటోందని భాజపా నేత జీవీఎల్ నరసింహారావు అన్నారు. రాష్ట్రానికి అవసరమైన వ్యవసాయాధారిత పరిశ్రమలు, ఇతర సాయానికి కేంద్రానికి తగిన ప్రతిపాదనలు పంపిస్తే వాటిని పరిశీలించి మంజూరు చేసేందుకు తనవంతు చొరవ చూపుతానని చెప్పారు.

ABOUT THE AUTHOR

...view details