కేక్ మిక్సింగ్ కార్యక్రమాన్ని విజయవాడ నోవాటెల్లో నిర్వహించారు. నగరానికి చెందిన మహిళా ప్రముఖులు, కేర్ అండ్ షేర్ ఛారిటబుల్ ట్రస్టు యువతులు ఉత్సాహంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. క్రిస్మస్ పండుగ సుమారు రెండునెలలు ఉండగానే ఈ కార్యక్రమం నిర్వహించారు.
బెజవాడలో కేక్ మిక్సింగ్.. ఉత్సాహంగా పాల్గొన్న యువతులు
విజయవాడ కేక్ మిక్సింగ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. క్రిస్మస్కు ముందస్తుగా ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో మహిళలు ఉత్సాహంగా పాల్గొన్నారు. కేకుల అమ్మకం ద్వారా వచ్చిన ఆదాయాన్ని కేర్ అండ్ షేర్ ఛారిటబుల్ ట్రస్టుకు అందజేస్తాయనున్నారు.
కేక్ మిక్సింగ్
కేక్ తయారిలో అనేక రకాల డ్రైఫ్రూట్స్, వివిధ రకాల మధుపానీయాలను కలిపి అద్భుత రుచిని తీసుకొచ్చామని ఎగ్జిక్యూటివ్ చెఫ్ వినయకుమార్ తెలిపారు. ఈ కేకుల అమ్మకాల ద్వారా వచ్చిన ఆదాయాన్ని కేర్ అండ్ షేర్ ఛారిటబుల్ ట్రస్టుకు అందజేస్తామని పేర్కొన్నారు.
ఇదీ చదవండి:AMARAVATHI PADAYATHRA : మరో ముందడుగు... ప్రారంభమైన రైతుల మహాపాదయాత్ర