ఆంధ్రప్రదేశ్

andhra pradesh

పాపికొండల్లో బోటింగ్‌ షికారు.. ఎప్పటినుంచో తెలుసా?

By

Published : Oct 27, 2021, 5:57 PM IST

రాష్ట్రంలో అత్యద్భుతమైన టూరిస్టు స్పాట్​లలో ముందు వరసలో ఉంటుంది పాపికొండలు. ఇక్కడ బోటు షికారుకు ఎంత ప్రాధాన్యత ఉంటుందో తెలిసిందే. ఈ నేపథ్యంలో.. ఈ ఏడాది పాపికొండల బోటింగ్ కు ప్రభుత్వం అనుమతులు జారీ చేసింది.

మంత్రి అవంతి
మంత్రి అవంతి

పాపికొండల్లో బోటింగ్‌కు అనుమతినిస్తున్నట్లు పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాసరావు తెలిపారు. బోటు ఆపరేటర్ల కోసం ప్రత్యేకంగా వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు.

రాష్ట్రంలో నదీ పర్యాటకం, ప్రయాణికుల భద్రత అంశంపై మంత్రి అవంతి శ్రీనివాసరావు.. బోటు ఆపరేటర్లతో సమావేశం నిర్వహించారు. పర్యాటక పరంగా ఏ ఒక్కరూ నష్ట పోకూడదనే లక్ష్యంతో.. రాష్ట్రంలో పర్యాటక రంగం అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్టు మంత్రి వెల్లడించారు. నవంబర్ 7 నుంచి పాపికొండల్లో బోటింగ్‌కు అనుమతినిస్తున్నట్లు అవంతి వెల్లడించారు.

రాష్ట్రంలో పర్యాటకుల భద్రతే ప్రాధాన్యతగా పర్యాటక బోట్ల నిర్వాహణకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ఎప్పటికప్పుడు బోట్ల సమాచారం తెలుసుకునేందుకు కంట్రోల్ రూమ్ లు ఏర్పాటు చేసినట్లు మంత్రి వెల్లడించారు.

ఇదీ చదవండి:MINISTER AVANTHI : 'పర్యాటకుల్ని ఆకర్షించేందుకు ప్రత్యేక వేడుకలు నిర్వహించాలి'

ABOUT THE AUTHOR

...view details