ఆంధ్రప్రదేశ్

andhra pradesh

విజయవాడలో యువకుడిపై దుండగుల దాడి.. సీసీ కెమెరాలో దృశ్యాలు

By

Published : Dec 22, 2020, 5:35 PM IST

విజయవాడలో మహేశ్ అనే యువకుడిపై కొందరు గుర్తు తెలియని వ్యక్తులు విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డారు. తీవ్రంగా గాయపడిన బాధితుడిని ఆసుపత్రిలో చికిత్స అందిస్తుండగా..దాడికి పాల్పడింది గంజాయి, బ్లేడ్ బ్యాచ్​ పనిగా పోలీసులు భావిస్తున్నారు.

యువకుడిపై దుండగుల దాడి
యువకుడిపై దుండగుల దాడి

యువకుడిపై దుండగుల దాడి

విజయవాడ చిట్టినగర్​లో పాల ఫ్యాక్టరీ వద్ద ద్విచక్రవాహనంపై వెళ్తున్న మహేశ్ అనే యువకుడిపై కొందరు యువకులు విచక్షణారహితంగా దాడి చేశారు. సీసీ కెమెరాలో దాడి దృశ్యాలు నమోదయ్యాయి. దుండగుల చేతిలో గాయపడిన మహేశ్​ను చికిత్స నిమిత్తం హెల్ప్ ఆసుపత్రికి తరలించారు. దాడి చేసిన దుండగులు పరారీలో ఉన్నారు.

గంజాయి లేదా బ్లేడ్ బ్యాచ్ పనిగా పోలీసులు భావిస్తున్నారు. బాధితుడి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. నిందితుల కోసం ప్రత్యేక బృందాల ద్వారా గాలింపు చర్యలు చేపట్టారు.

ABOUT THE AUTHOR

...view details