ఆంధ్రప్రదేశ్

andhra pradesh

రేషన్​ ఇప్పించలేదని మహిళా వాలంటీర్​పై దాడి

By

Published : May 1, 2020, 3:12 PM IST

విజయవాడలో మహిళా వాలంటీర్​పై జక్కంపూడి కాలనీవాసులు దాడి చేశారు. రేషన్ ఇప్పించలేదని దాడికి పాల్పడినట్లు సమాచారం. ఘటనపై చర్యలు తీసుకోవాలంటూ వాలంటీర్లు సచివాలయం వద్ద ఆందోళనకు దిగారు.

attack on female volunteer
attack on female volunteer

రేషన్​ ఇప్పించలేదని మహిళా వాలంటీర్​పై దాడి

విజయవాడలో జేఎన్​యూఆర్​ఎమ్ వైఎస్సార్ కాలనీలో మహిళా వాలంటీర్​పై దాడి చేయడాన్ని నిరసిస్తూ... సచివాలయం వద్ద వాలంటీర్లు విధులు బహిష్కరించి అందోళనకు దిగారు. జక్కంపూడి కాలనీకి చెందిన సాధిక అనే మహిళా వాలంటీర్​పై కాలనీ వాసులు దాడికి పాల్పడ్డారు. రెండో విడత రేషన్ ఇప్పించలేదనే కోపంతో ఆమెతో పాటు కుటుంబ సభ్యులపైనా దాడి చేశారు. దాడికి పాల్పడిన వారిని అరెస్టు చేయాలని వాలంటీర్లు డిమాండ్ చేశారు.

ABOUT THE AUTHOR

...view details