ఆంధ్రప్రదేశ్

andhra pradesh

RTC: బస్సులో మాస్కు ధరించకుంటే జరిమానా..ఆర్టీసీ ఈడీ ఏమన్నారంటే..!

By

Published : Jan 10, 2022, 10:25 PM IST

బస్సులో మాస్కు ధరించకుంటే జరిమానా
బస్సులో మాస్కు ధరించకుంటే జరిమానా

APSRTC: ఆర్టీసీ బస్సుల్లో మాస్కు ధరించకుంటే జరిమానా విధిస్తున్నారన్న ప్రచారంలో వాస్తవం లేదని ఆర్టీసీ ఈడీ బ్రహ్మానందరెడ్డి స్పష్టం చేశారు. బస్సుల్లో మాస్కు తప్పనిసరిగా ధరించాలని చెబుతున్నామని..,బస్టాండ్‌లో మాస్కు లేకుండా తిరుగుతున్న వారికి మాత్రమే జరిమానా విధిస్తున్నట్లు ఆయన వెల్లడించారు.

APSRTC: ఆర్టీసీ బస్సుల్లో మాస్కు ధరించకుంటే జరిమానా విధిస్తున్నారన్న ప్రచారంపై ఆర్టీసీ ఈడీ బ్రహ్మానందరెడ్డి స్పందించారు. జరిమానా వార్తల్లో వాస్తవం లేదని అన్నారు. తోటి ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా బస్సుల్లో మాస్కులు తప్పకుండా ధరించాలని చెబుతున్నామన్నారు. అంతే కానీ బస్సుల్లో ప్రయాణించే వారు మాస్కు ధరించకపోతే జరిమానా విధించటం లేదని తెలిపారు.

బస్టాండ్‌లో మాస్కు లేకుండా తిరుగుతున్న వారికి మాత్రమే జరిమానా విధిస్తున్నట్లు బ్రహ్మానందరెడ్డి స్పష్టం చేశారు. నో పార్కింగ్ జోన్‌లో బైకులు, వాహనాలు ఉంచటం, బస్టాండు పరిసరాలు అపరిశుభ్రం చేస్తున్న వారికి జరిమానా విధిస్తున్నామన్నారు.

ఇదీ చదవండి

New Corona Cases in AP: రాష్ట్రంలో పెరుగుతున్న కరోనా కేసులు.. కొత్తగా 984 మందికి పాజిటివ్‌

ABOUT THE AUTHOR

...view details