ఆంధ్రప్రదేశ్

andhra pradesh

'వైకాపా వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లండి... పనబాకను గెలిపించండి'

By

Published : Mar 22, 2021, 9:02 PM IST

చంద్రబాబు హయాంలో జరిగిన అభివృద్ధిని ప్రజలకు వివరించాలని, వైకాపా ప్రభుత్వం వైఫల్యాలను జనాల్లోకి తీసుకెళ్లి తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నికల్లో విజయం సాధించాలని.. కార్యకర్తలకు తెదేపా అగ్ర నేతలు దిశానిర్దేశం చేశారు. 22 మంది ఎంపీలున్నా అధికారపార్టీ ప్రత్యేకహోదా సాధించలేకపోయిందని విమర్శించారు.

Tirupati Lok Sabha by-election  Preparation meeting
తిరుపతి లోక్‌సభ స్థానం ఉపఎన్నిక సన్నాహక సమావేశం

అవినీతి, అక్రమాలు, దౌర్జన్యాలు, బెదిరింపు రాజకీయాలపైనే తెలుగుదేశం పోరాటమని... ఆ పార్టీ నేత, మండలిలో ప్రతిపక్ష నాయకుడు యనమల రామకృష్ణుడు అన్నారు. చిత్తూరు జిల్లాలోని సత్యవేడు, శ్రీకాళహస్తి నియోజకవర్గాల తెలుగుదేశం కార్యకర్తలతో... తిరుపతి లోక్‌సభస్థానం ఉపఎన్నిక సన్నాహక సమావేశం నిర్వహించారు.

చంద్రబాబు హయాంలో జరిగిన అభివృద్ధిని వివరించిన నేతలు.. వైకాపా ప్రభుత్వం వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. తిరుపతిలో మోదీ ఇచ్చిన ప్రత్యేక హోదా హామీని... వైకాపా ఇప్పటివరకూ ఎందుకు సాధించలేకపోయిందని ప్రశ్నించారు. నిజాయితీతో సేవచేసే పనబాక లక్ష్మిని గెలిపించుకోవాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.

ABOUT THE AUTHOR

...view details