ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ఘనంగా ప్రారంభమైన శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక వసంతోత్సవాలు..

By

Published : May 16, 2022, 4:48 AM IST

Sri Padmavathi Ammavari Vasathontsavalu: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక వసంతోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. వసంతోత్సవాలల్లో భాగంగా.. నేడు అమ్మవారికి స్నపనతిరుమంజనం, స్వర్ణరథోత్సవం నిర్వహించనున్నారు.

Tiruchanoor Sri Padmavathi Ammavari Vasathontsavalu
Tiruchanoor Sri Padmavathi Ammavari Vasathontsavalu

Padmavathi Ammavari Vasathontsavalu: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక వసంతోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. వసంతోత్సవాలలో భాగంగా ఆలయ సమీపంలోని శుక్రవారపు తోటలో అమ్మవారికి స్నపనతిరుమంజనాన్ని అర్చకులు వేడుక‌గా నిర్వహించారు. పసుపు, కుంకుమ, పాలు, పెరుగు, తేనె, చందనం, కొబ్బరినీళ్లతో అభిషేకం చేశారు. వసంత ఋతువులో మేషరాశిలో సూర్యుడు ఎక్కువ ప్రకాశవంతంగా ఉంటాడంతో సూర్యకిరణాల వేడి వల్ల జీవులకు వ్యాధి బాధలు కలుగుతాయి. లోకమాత శ్రీ పద్మావతి అమ్మవారిని వసంతోత్సవాల ద్వారా ఆరాధించడం వల్ల శారీరక, మానసిక తాపాలు తొలగుతాయని అర్చకులు తెలిపారు. నేడు అమ్మవారికి స్నపనతిరుమంజనం, స్వర్ణరథోత్సవం నిర్వహించనున్నారు.

ABOUT THE AUTHOR

...view details