నెల్లూరు నగరంలో రూ. 10 లక్షల విలువైన ఎర్రచందనం దుంగలు, జింక చర్మం, దుప్పి కొమ్ములు అటవీ అధికారులు సోమవారం స్వాధీనం చేసుకున్నారు. ఒకరిని అదుపులోకి తీసుకున్నారు. నెల్లూరు- ఆత్మకూరు రేంజ్ నుంచి నెల్లూరు నగరానికి అక్రమ రవాణా జరుగుతుందనే సమాచారం జిల్లా అటవీ అధికారి షణ్ముఖ్కుమార్కు చేరింది. సోమవారం ఉదయం నెల్లూరు, ఆత్మకూరు రేంజర్లకు ఈ సమాధానం ఆయన అందించాుర. దీంతో ఆయా రేంజర్లు అక్రమ వ్యాపారులపై నిఘా పెట్టారు. నెల్లూరు నగంలోని కరెంటు ఆఫీసు ప్రాంతంలోని ఓ ఇంటి నుంచి ఎర్రచందనం రవాణా జరుగుతోందని తెలుసుకున్నారు. దీంతో కరెంటు ఆఫీసు నుంచి పొదలకూరు రోడ్డుకు వెళ్లే మార్గంలోని ఓ ఇంటిపై దాడి చేశారు. ఇంట్లో ఉన్న ఓ బ్యాగు చూడగా అందులో జింక చర్మం, రెండు దుప్పి కొమ్ములు, ఎర్రచందనం గ్లాసు, రెండు పూల కూజాలతో పాటు వినాయకుడి ప్రతిమ లభించాయని నెల్లూరు అటవీశాఖ అధికారి మారుతీప్రసాద్ తెలిపారు. వీటి విలువ రూ. 10 లక్షలు ఉంటాయని అంచనా వేశారు. నిందితుడు పచ్చా వెంకటేశ్వర్లును అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు టేకు వ్యాపారి అని సమాచారం. అతనిపై గతంలో మనుబోలు పోలీసు స్టేషన్లో ఫోర్జరీ కేసు ఉన్నట్లు నెల్లూరు రేంజర్ తెలిపారు. నిందితుడి ఫోన్లో విశ్రాంత అటవీ అధికారుల పేర్లు ఉన్నట్లు తెలిసింది. ప్రకాశం, కడప జిల్లాల నుంచి ఎర్రచందనం వస్తువులు సేకరిస్తున్నాడని, ఈ విషయమై పూర్తి వివరాలు రావాల్సి ఉందని జిల్లా అటవీ అధికారి షణ్ముఖ్కుమార్ తెలిపారు.
రూ. 10 లక్షల విలువైన ఎర్రచందనం వస్తువుల స్వాధీనం
నెల్లూరులో అటవీ శాఖ అధికారులు దాడులు నిర్వహించి ఎర్రచందనంతో చేసిన వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ దాదాపు 10 లక్షల రూపాయలు ఉంటుందని అంచనా వేస్తున్నారు. నగరంలోని కరెంట్ ఆఫీస్ దగ్గరున్న ఎస్బీఐ కాలనీలో ఈ సంఘటన చోటు చేసుకుంది.
ఎర్రచందనం దుంగలు, జింక చర్మం, దుప్పి కొమ్ములు స్వాధీనం చేసుకున్న అటవీ అధికారులు