ఆంధ్రప్రదేశ్

andhra pradesh

అభద్రతాభావంతోనే దాడులకు తెగబడుతున్నారు: లోకేశ్​

By

Published : May 22, 2022, 6:25 PM IST

Lokesh on Revathi issue: వైకాపా నాయకులను ప్రశ్నిస్తే దాడులకు తెగబడటం, వారి అభద్రతాభావాన్ని బయటపెడుతోందని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ ధ్వజమెత్తారు. నెల్లూరు జిల్లాలో తెదేపా నాయకురాలి కుటుంబంపై దాడి చేసినవారిపై చర్యలు తీసుకోవాలని లోకేశ్​ డిమాండ్​ చేశారు.

Nara Lokesh
Nara Lokesh

Lokesh on Revathi issue: వైకాపా నాయకులను ప్రశ్నిస్తే దాడులకు తెగబడటం, వారి అభద్రతాభావాన్ని బయటపెడుతోందని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ ధ్వజమెత్తారు. నెల్లూరు సంతపేట పోలీస్ స్టేషన్ సమీపంలోనే.. తెదేపా నాయకురాలు రేవతిపై వైకాపా గూండాల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. మాజీ మంత్రి అనిల్​పై విమర్శలు చేశారనే అక్కసుతో.. రేవతి భర్తను పోలీస్ స్టేషన్​కి పిలిచి వేధించడం, స్టేషన్​కి వెళ్లిన రేవతిపై దాడి ఘటన చూస్తుంటే.. అసలు ఈ రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ ఉందా అనే అనుమానం కలుగుతోందని మండిపడ్డారు. రేవతిపై దాడి చేసిన వైకాపా కార్యకర్తలు, ఆమె భర్తను వేధించిన పోలీసులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

ABOUT THE AUTHOR

...view details