ఆంధ్రప్రదేశ్

andhra pradesh

నందికొట్కూరులో ఉరి వేసుకుని దంపతుల ఆత్మహత్య

By

Published : Mar 6, 2022, 2:31 PM IST

couple committed suicide: నందికొట్కూరులో దంపతులు ఉరి వేసుకున్నారు. ఘటనాస్థలాన్ని పరిశీలించిన పోలీసులు... కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.

couple committed suicide
ఉరివేసుకుని దంపతుల ఆత్మహత్య

couple committed suicide: కర్నూలు జిల్లా నందికొట్కూరులో విషాదం చోటు చేసుకుంది. పట్టణంలోని ఓ ఇంట్లో దంపతులు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. మృతులు వేణు(25), సరస్వతి(22) దంపతులుగా గుర్తించారు. వీరికి నాలుగేళ్ల క్రితం వివాహమైందని.. ఇప్పటికీ పిల్లలు పుట్టలేదని స్థానికులు తెలిపారు.

కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగించేవారని చెప్పారు. దంపతులిద్దరూ అన్యోన్యంగా ఉండేవారని బంధువులు, స్థానికులు చెప్పారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉందని పోలీసులు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details