ఆంధ్రప్రదేశ్

andhra pradesh

'న్యాయవాది హత్య కేసులో భూమా కుటుంబాన్ని లాగడం సరికాదు'

By

Published : Oct 30, 2020, 7:22 PM IST

నంద్యాల ప్రాంతంలో జరిగిన న్యాయవాది హత్య కేసులో భూమా కుటుంబానికి సంబంధం ఉందనడం సబబు కాదని.. మాజీ మంత్రి అఖిలప్రియ అన్నారు. తమపై ఆరోపణలు చేస్తున్న ఎమ్మెల్యే శిల్పా రవి వాటిని నిరూపించగలరా అని సవాల్ విసిరారు.

bhuma akhila priya
భూమా అఖిలప్రియ

కర్నూలు జిల్లాలో ఎక్కడ ఏం జరిగినా భూమా కుటుంబాన్ని నిందించడం అందరికీ అలవాటైందని మాజీ మంత్రి అఖిలప్రియ ఆవేదన వ్యక్తం చేశారు. అక్టోబర్ 9న నంద్యాల ప్రాంతంలో జరిగిన న్యాయవాది సుబ్బారాయుడు హత్యలో తమ హస్తం ఉన్నట్లు తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. నంద్యాల ఎమ్మెల్యే శిల్పా రవి ఈ కేసులో భూమా కుటుంబానికి సంబంధం ఉందనడం ఎంతవరకు సబబని నిలదీశారు. వారం రోజుల్లో తను చేసిన ఆరోపణలను నిరూపించగలరా అని సవాల్ విసిరారు.

ABOUT THE AUTHOR

...view details