ఆంధ్రప్రదేశ్

andhra pradesh

మైనర్ల ఘాతుకం.. బాలికపై మైనర్ బాలుర అత్యాచారం

By

Published : Oct 16, 2022, 8:33 AM IST

Updated : Oct 16, 2022, 11:46 AM IST

Minor girl rape: కడప జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ఎనిమిదో తరగతి చదువుతున్న బాలికపై పది,ఇంటర్ చదువుతున్న నలుగురు విద్యార్థులు సామూహిక అత్యాచారం చేశారు. అంతటితో ఆగకుండా ఈ దురాగతాన్ని వీడియో తీసి, సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, నిందితులను కడప జువైనల్ కోర్టులో హాజరుపరిచారు.

Four arrested for raping minor girl
Minor girl rape

gang rape on minor girl వైఎస్ఆర్ కడప జిల్లా గోపవరం మండలంలోని ఓ గ్రామంలో.. మైనర్ బాలికపై సామూహిక అత్యాచార ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. బాలికపై అత్యాచారం చేయడమే కాకుండా.. ఆ దురాగతాన్ని వీడియో తీశారు. ఈ దారుణానికి పాల్పడింది కూడా మైనర్ బాలురే కావడం విశేషం. 3 నెలల కిందట జరిగిన సంఘటనను బాధితురాలు అవమాన భారంతో గోప్యంగా ఉంచింది. నిందితులు మాత్రం పైశాచిక ఆనందంతో వీడియోను సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేయడంతో.. ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. దీంతో బాధితురాలి కుటుంబీకుల పోలీసులకు ఫిర్యాదు చేశారు.

వివరాల్లోకి వెళ్తే, ఎనిమిదో తరగతి చదువుతున్న విద్యార్థిని.. బహిర్ భూమి కోసం చెట్ల పొదల్లోకి వెళ్లింది. ఆ సమయంలో నలుగురు బాలురు.. బాలికపై సామూహిక అత్యాచారం చేయడంతోపాటు వీడియో తీశారు. దీన్ని సామాజిక మాధ్యమాల్లో ఉంచారు. ఈనెల 13న బాధితురాలి తల్లిదండ్రులు ఫిర్యాదు మేరకు బద్వేల్ గ్రామీణ పోలీసులు పోక్సో, అత్యాచారం, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద నలుగురిపై కేసు నమోదు చేశారు. వీరిని కడప జువైనల్ కోర్టులో హాజరుపరిచారు. సదరు బాలికకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను ఎవరైనా షేర్ చేసినా కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.

ఇవీ చదవండి:

Last Updated : Oct 16, 2022, 11:46 AM IST

ABOUT THE AUTHOR

...view details