ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ఎక్కడ చదువుతున్నా " అమ్మఒడి" పథకం వర్తింపు

By

Published : Nov 5, 2019, 6:26 AM IST

ప్రభుత్వం అమ్మఒడిపథకంలో కీలక మార్పులు చేసింది. అమ్మఒడి కింద పిల్లలతో సంబంధం లేకుండా తల్లి, గార్డియన్ కేంద్రంగా రూ.15వేలు చెల్లించనున్నారు.ఈ పథకానికి సంబంధించిన మార్గదర్శకాల అమలుకు పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

అమ్మఒడిపథకం

అమ్మఒడి పథకం కింద పిల్లలతో సంబంధం లేకుండా తల్లి, గార్డియన్ కేంద్రంగా రూ.15వేలు చెల్లించనున్నారు. ఎంతమంది పిల్లలున్నప్పటీకీ రూ.15వేలే ఇవ్వనున్నారు. ఈ పథకం అమలుకు సంబంధించిన మార్గదర్శకాలను పాఠశాల విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బి. రాజశేఖర్ విడుదల చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 1-12 తరగతి వరకు ప్రభుత్వ, ప్రైవేట్ ఎయిడేడ్, ప్రైవేట్ పాఠశాలలు, జూనియర్ కళాశాలలు, రెసిడెన్షియల్ స్కూల్స్, కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులు ఈ పథకానికి అర్హులు.

మార్గదర్శకాలు
⦁ విద్యార్థులకు 75% హాజరు ఉండాలి.
⦁ స్వచ్ఛంద సంస్థల్లో చదివే అనాథలు, వీధిబాలలకు సంబంధించి ఆయా శాఖలతో సంప్రదించి చెల్లిస్తారు.
⦁ విద్యాసంవత్సరం మధ్యలో చదువు మానేసిన పిల్లలు అనర్హులు.
⦁ కేంద్ర, రాష్ట్ర ఉద్యోగులు, పింఛన్​దారులు, ఆదాయపు పన్ను చెల్లింపుదారులు ఈ పథకానికి అనర్హులు.
⦁ విద్యార్థి తల్లి బ్యాంకు, తపాల ఖాతాకు ప్రతి ఏడాది జనవరిలో రూ.15 వేలు ఆన్​లైన్ లో చెల్లిస్తారు.
⦁ దీనికోసం పాఠశాల విద్యాశాఖ ప్రత్యేక వెబ్​సైట్ ని రూపొందిస్తోంది.
⦁ విద్యార్థి తల్లి వివరాలను విద్యాసంస్థలు సేకరిస్తాయి. వీటిని డేటా, పౌరసరఫరాల శాఖ , ఇతర విభాగాలతో సరిపోల్చి చూస్తారు.
⦁ రేషన్ కార్డు లేనివారికీ ఈ పథకం వర్తించనుంది.

ఎక్కడ చదువుతున్నా " అమ్మఒడి" పథకం వర్తింపు

ఇదీచూడండి.'రూ.6400 కోట్లతో రోడ్లకు మరమ్మతులు'

ABOUT THE AUTHOR

...view details