ఆంధ్రప్రదేశ్

andhra pradesh

murder case chased : హత్య కేసు ఛేదన... ప్రేమ వ్యవహారమే కారణం

By

Published : Oct 16, 2021, 6:57 PM IST

Updated : Oct 16, 2021, 8:25 PM IST

హత్య కేసు ఛేదన
హత్య కేసు ఛేదన

18:55 October 16

నిందితుల నుంచి 4 కత్తులు, కర్రలు, నైలాన్ తాళ్లు స్వాధీనం

    గుంటూరు జిల్లా పల్లపాడులో జరిగిన గోపి అనే యువకుడి హత్య కేసును పోలీసులు(police chased murder case) ఛేదించారు. కులాంతర ప్రేమే(inter cast love) హత్యకు కారణమని పోలీసులు గుర్తించారు. ఈ కేసులో 11 మందిని అరెస్టు(arrest) చేశారు. నిందితుల నుంచి 4 కత్తులు, కర్రలు, నైలాన్ తాళ్లు స్వాధీనం చేసుకున్నారు.

   గుంటూరు జిల్లా వట్టిచెరుకూరు మండలం పల్లపాడు(pallapadu) గ్రామానికి చెందిన గోపి(gopi).. అదే గ్రామంలోని ఓ యువతిని ప్రేమించాడు. విషయం తెలుసుకున్న యువతి కుటుంబీకులు... గోపిని హెచ్చరించారు(warning). వారి మాటలను గోపి బేఖాతరు చేయడంతో దారుణంగా హత్య చేసినట్లు గుంటూరు దక్షిణ మండల డీఎస్పీ జెస్సీ ప్రశాంతి(DSP jessy prashanthi) తెలిపారు. స్నేహితుల సహాయంతో గోపిని  నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి, కర్రలతో దాడి(attack with sticks) చేశారు. తీవ్రంగా గాయపరిచిన అనంతరం అప్పాపురం కాల్వ(appapuram canal) వద్దకు తీసుకువెళ్లి, కత్తితో గొంతుకోసి హత్య చేశారని డీఎస్పీ(DSP) వెల్లడించారు. మృతదేహం(Dead body) బయటకు రాకుండా సంచిని రాళ్లతో కట్టేసి అప్పాపురం కాల్వలో పడేసినట్లు వివరించారు.  

 ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని విచారణ చేస్తుండగా... హత్యకు పాల్పడిన నిందితులను పట్టుకున్నట్లు పోలీసులు(police) వెల్లడించారు. కేసులో మొత్తం 11 మందిని అరెస్టు(arrest) చేసినట్లు తెలిపారు. వారి వద్ద నుంచి 4 కత్తులు, కర్రలు, నైలాన్ తాళ్లు స్వాధీనం చేసుకున్నామన్నారు.  

స్నేహితుల మాటలు నమ్మి గోపీ నిర్మానుష్య ప్రాంతానికి వెళ్లాడు. నిందితులు గోపీని కర్రలతో తీవ్రంగా కొట్టారు. గొంతుకోసి చంపి మృతదేహాన్ని బస్తాలో కుక్కారు. మృతదేహం పైకి తేలకుండా రాళ్లను కట్టి కాలువలో పడేశారు.  కేసులో 11 మందిని అరెస్టు చేశాం. నిందితుల నుంచి 4 కత్తులు, కర్రలు, నైలాన్ తాళ్లు స్వాధీనం చేసుకున్నాం.  

                                                                                                 - డీఎస్పీ జెస్సీ ప్రశాంతి

అనుబంధ కథనం

Murder: యువకుడి దారుణ హత్య..ప్రేమ వ్యవహారమేనా..!

Last Updated : Oct 16, 2021, 8:25 PM IST

ABOUT THE AUTHOR

...view details