ఆంధ్రప్రదేశ్

andhra pradesh

'పార్టీ కోసం కోట్లు ఖర్చుపెట్టాం.. ఎమ్మెల్సీ హామీ అంటూ మర్రిని మోసం చేశారు'

By

Published : Dec 10, 2021, 1:07 PM IST

marri rajasekhar reddy relative slams cm jagan: వైకాపా నేత మర్రి రాజశేఖర్‌ కు ఎమ్మెల్సీ ఇస్తామని చెప్పి పార్టీ మోసం చేసిందని.. ఆయన బంధువు వెంకట సుబయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీ కోసం కోట్లు ఖర్చు పెట్టామని వాపోయారు.

marri rajasekhar reddy
marri rajasekhar reddy

marri rajasekhar reddy relative slams cm jagan: వైకాపా నేత మర్రి రాజశేఖర్‌కు.. ఎమ్మెల్సీ హామీ అంటూ మోసం చేశారని ఆయన కుటుంబం తొలిసారి గళమెత్తింది. చిలకలూరిపేటలో.. మాజీ సీఎం రోశయ్య సంస్మరణ సభకు హాజరైన మర్రి రాజశేఖర్‌ బావమరిది వెంకట సుబ్బయ్య.. వైకాపా అధిష్టానంపై బాహాటంగానే అసంతృప్తి వెళ్లగక్కారు.

వెంకట సుబ్బయ్య

ఎమ్మెల్యే టికెట్‌ను త్యాగం చేసినప్పుడు గుండెల్లో పెట్టుకుని చూస్తామని నమ్మబలికారంటూ ఆవేదన వ్యక్తంచేశారు. పార్టీ కోసం కోట్లు ఖర్చుపెట్టామని వాపోయారు. వెంకటయ్య సుబయ్య మాట్లాడుతున్న సమయంలో.. మర్రిరాజశేఖర్ రెడ్డి వేదికపైనే ఉండటం కొసమెరుపు.

ఎమ్మెల్యే ఎన్నికల్లో రజనికి టికెట్ ఇచ్చినప్పుడు మమ్మల్ని గుండెల్లో పెట్టుకొని చూస్తామన్నారు. మేం పోటీకి దూరంగా ఉండి పార్టికి సేవ చేశాం. ఎమ్మెల్సీ ఇస్తామని చెప్పి మోసం చేశారు. రోశయ్య ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో రెడ్లు సహకరించలేదు -వెంకట సుబ్బయ్య, మరి రాజశేఖర్ బావమరిది


ఇదీ చదవండి:

'కొనప్రాణాలతో సీడీఎస్​ రావత్‌.. నీళ్లు కావాలని అడిగారు'

ABOUT THE AUTHOR

...view details