ఆంధ్రప్రదేశ్

andhra pradesh

అమరావతి రైతులపై భౌతిక దాడి ఖండిస్తూ గుంటూరులో నిరసన

By

Published : Dec 7, 2020, 4:03 PM IST

అమరావతి రైతులపై భౌతిక దాడులు ఉద్దేశపూర్వకంగానే జరిగాయని గుంటూరు యువజన విద్యార్థి ఐకాస నాయకులు అన్నారు. దాడులకు నిరసనగా గుంటూరులో ఆందోళన చేపట్టారు.

protest in guntur
అమరావతి రైతులపై భౌతిక దాడిని ఖండిస్తూ గుంటూరులో నిరసన

ఉద్దండరాయునిపాలెంలో అమరావతి రైతులపై జరిగిన భౌతిక దాడిని ఖండిస్తూ... గుంటూరులో యువజన విద్యార్థి ఐకాస నాయుకులు నిరసన ప్రదర్శనలు ప్రదర్శనలు. లాడ్జి సెంటర్ అంబేడ్కర్ విగ్రహం వద్ద నల్లజెండాలతో ఆందోళన తెలిపారు.

ఏలూరు బాధితుల ఘటన నుంచి దృష్టి మరల్చేందుకే.. అమరావతి రైతులపై భౌతిక దాడులకు పాల్పడ్డారని యువజన విద్యార్థి ఐకాస కన్వీనర్ రావిపాటి సాయికృష్ణ అన్నారు. అమరావతిని రాజధానిగా ప్రకటించే వరకు ఉద్యమాన్ని కొనసాగిస్తామని హెచ్చరించారు. వైకాపా నేతలే కిరాయి ముఠాలను ఏర్పాటు చేసి.. రైతులపైన భౌతిక దాడులు జరిపించారని దళిత ఐకాస కో కన్వీనర్ చిలక బసవయ్య ఆరోపించారు. ఉద్దేశపూర్వకంగానే రైతుల పైన దాడులు జరుగుతున్నాయన్నారు. మూడు రాజధానుల నిర్ణయాన్ని వెనక్కి తీసుకుని అమరావతిని రాజధానిగా ప్రకటించే వరకు ఉద్యమం ఆగదని స్పష్టం చేశారు.

ABOUT THE AUTHOR

...view details