ఆంధ్రప్రదేశ్

andhra pradesh

'ఆ నలుగురు' సీన్ రిపీట్‌ : భర్త శవాన్ని ఇంట్లో పెట్టి.. రిజిస్ట్రార్ ఆఫీస్​కు వెళ్లారు!

By

Published : Jul 9, 2022, 4:15 PM IST

Wives postponed husband's funeral : "ఆ నలుగురు" సినిమాలో రాజేంద్రప్రసాద్ అంత్యక్రియలను కోటశ్రీనివాస రావు అడ్డుకుంటాడు. తన దగ్గర తీసుకున్న అప్పు చెల్లించే వరకు దహనసంస్కారాలు జరగనీయబోనని భీష్మిస్తాడు. ఇలాంటి సీనే జగిత్యాల జిల్లాలో రిపీట్ అయింది. కానీ ఇక్కడ అంత్యక్రియలు అడ్డుకుంది బయట అప్పిచ్చిన వాళ్లెవరో కాదు.. స్వయంగా అతని ఇద్దరు భార్యలే! భర్త చనిపోయిన బాధ కూడా మరిచిపోయి వాళ్లు అతడి దహనసంస్కారాలకు అడ్డుపడేంత పెద్ద కారణం ఏమయ్యుంటుందంటారా..? ఈ స్టోరీ చదవండి మీకే తెలుస్తుంది.

Wives
అత్యక్రియలను అడ్డుకున్న భార్యలు

Wives postponed husband's funeral : "మానవ బంధాలు కేవలం ఆర్థిక సంబంధాలు" అన్నారు విఖ్యాత ఆర్థికవేత్త కారల్ మార్క్స్. ఇది వాస్తవమే అన్నట్టుగా నిత్యం ఎన్నో సంఘటనలు మనం చూస్తూనే ఉన్నాం. డబ్బుకోసం ఎన్నో అమానవీయ ఘటనలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. తాజాగా.. మరో దారుణం వెలుగు చూసింది.

నిన్నా మొన్నటి దాక ఆస్తి కోసం.. తల్లిదండ్రులు, అన్నదమ్ములు, అక్కాచెళ్లెల్ల మధ్య గొడవలు జరగడం.. ప్రాణాలు తీసుకోవడమూ చూశాం. కానీ కట్టుకున్న భర్త కన్ను మూస్తే అంత్యక్రియలు జరిపించాల్సిన భార్యలు ఆస్తి పంపకాల కోసం దహనసంస్కారాలను అడ్డుకున్నారు. ఈ ఘటన తెలంగాణలోని జగిత్యాల జిల్లా కోరుట్ల మండలంలో చోటుచేసుకుంది.

కోరుట్ల మండలం ఐలాపూర్ గ్రామానికి చెందిన నర్సింహులు కొంత కాలం నుంచి కోరుట్లోల నివాసముంటున్నాడు. ఆయనకు ఇద్దరు భార్యలున్నారు. ఇటీవలే నర్సింలు అనారోగ్యంతో మృతి చెందాడు. సంప్రదాయం ప్రకారం ఆయన అంత్యక్రియలు నిర్వహించాల్సి ఉండగా.. ఆస్తిలో వాటా కోసం ఇద్దరు భార్యలు అతడి మృతదేహం ముందే గొడవకు దిగారు.

అంతటితో ఆగకుండా మృతదేహాన్ని ఇంట్లోనే వదిలేసి ఆస్తి పంపకాల కోసం రిజిస్ట్రార్ కార్యాలయానికి వెళ్లారు. తమ పేర్ల మీద ఆస్తి రిజిస్ట్రేషన్ చేయించుకున్న మరునాడు నర్సింహులు అంత్యక్రియలు నిర్వహించారు. ఈ విషయం తెలిసి గ్రామస్థులు విస్తుపోయారు. శవాన్ని వాకిట్లో పెట్టి ఆస్తి కోసం పంచాయతీ ఏంటని విస్మయం చెందారు.

ఇవీ చదవండి :

ABOUT THE AUTHOR

...view details