ఆంధ్రప్రదేశ్

andhra pradesh

టీఎస్‌పీఎస్సీ వెబ్‌సైట్​లో గ్రూప్ 1 హాల్‌టికెట్లు.. డౌన్‌లోడ్ చేసుకోండిలా..

By

Published : Oct 9, 2022, 7:50 PM IST

Group 1 Prelims Hall Tickets : తెలంగాణ ఏర్పడ్డాక నిర్వహిస్తున్న తొలి గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష హాల్‌టికెట్లు అందుబాటులోకి వచ్చాయి. టీఎస్‌పీఎస్సీ అధికారిక వెబ్‌సైట్‌లో పొందుపరిచి.. ప్రత్యేక లింక్ ఏర్పాటు చేసింది.

tspsc
tspsc

Group 1 Prelims Hall Tickets: రాష్ట్రంలో తొలి గ్రూప్‌-1 ప్రిలిమినరీ పరీక్షకు సంబంధించిన హాల్‌టికెట్లు అందుబాటులోకి వచ్చాయి. టీఎస్‌పీఎస్సీ ముందుగా ప్రకటించిన విధంగానే హాల్‌టికెట్లను అధికారిక వెబ్‌సైట్‌లో పొందుపరిచి, ప్రత్యేక లింక్‌ ఏర్పాటు చేసింది. రాష్ట్రంలో 503 గ్రూప్‌-1 ఉద్యోగాల కోసం మొత్తం 3,80,202 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. అక్టోబర్‌ 16న ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించనున్నారు. జనవరి లేదా ఫిబ్రవరిలో గ్రూప్‌-1 మెయిన్స్‌ పరీక్ష నిర్వహించే అవకాశముంది.

హాల్‌టికెట్‌ డౌన్‌లోడ్‌ కోసం క్లిక్‌ చేయండి
గ్రూప్‌-1 ప్రకటనలో మొత్తం 503 పోస్టుల్లో మహిళలకు 225 రిజర్వు అయ్యాయి. వీటికి 3,80,202 మంది దరఖాస్తు చేయగా, ఒక్కో పోస్టుకు సగటున 755 మంది పోటీపడుతున్నారు. జనరల్‌ పోస్టుల్లోనూ మెరిట్‌ సాధిస్తే మరిన్ని పోస్టులు పొందేందుకు అవకాశముంది. దివ్యాంగుల కేటగిరీలో గల 24 పోస్టులకు 6,105 మంది దరఖాస్తు చేశారు. ఒక్కో పోస్టుకు 254 మంది చొప్పున పోటీలో ఉన్నారు. సుమారు 51,553(15.33శాతం)మంది ప్రభుత్వ ఉద్యోగులూ దరఖాస్తు చేశారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details