Minister Kottu Satyanarayana: రాష్ట్రంలోని కొన్ని మఠాల్లో మఠాధిపతులు పెద్ద ఎత్తున అవకతవకలకు పాల్పడుతున్నారని, వాటిని అరికట్టేందుకే ధార్మిక పరిషద్‌ను ఏర్పాటు చేసినట్లు దేవాదాయశాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ తెలిపారు. ‘మఠాల్లో అక్రమాలను అరికట్టాలని సీఎం జగన్ ఆదేశంతోనే 21 మంది సభ్యులతో ధార్మిక పరిషద్‌ను ఏర్పాటు చేశాం’ అని పేర్కొన్నారు. అవకతవకలకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకునే అధికారం పరిషద్‌కు ఉంటుందన్నారు. 11 ఏళ్లకు మించి భూముల లీజు గడువును పెంచే అధికారమూ కమిటీకి ఉంటుందని తెలిపారు. సచివాలయంలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 2014లో ధార్మిక పరిషద్ 3ఏళ్ల కాలపరిమితితో చివరిసారిగా కొలువుదీరింది. ఆ తర్వాత దాన్ని నియమించాల్సి ఉన్నా అప్పట్లో తెదేపా ప్రభుత్వం పట్టించుకోలేదు. రూ.కోట్ల విలువైన భూములు అన్యాక్రాంతం అవుతున్నా కమిటీని ఎందుకు ఏర్పాటు చేయలేదు’ అని ప్రశ్నించారు. ‘అర్చకుల చేతుల్లోని భూములపై, భజంత్రీలు, రజకులు, ఆలయ సేవకులకు గతంలో ఇచ్చిన మాన్యాలపై పర్యవేక్షణ అధికారం దేవాదాయశాఖదే’ అని తెలిపారు. ‘ధూపదీప నైవేద్య పథకాన్ని ఈ నెల నుంచే అమలు చేస్తాం. దేవాదాయ ట్రైబ్యునల్‌లో పెండింగ్‌లో ఉన్న 4,708 కేసుల పురోగతిని తెలుసుకునేందుకు ప్రత్యేక వెబ్‌సైట్‌ను ఏర్పాటు చేయనున్నాం. దేవాదాయశాఖ పరిధిలో 4.09 లక్షల ఎకరాల భూమి ఉంది. ఆక్రమణల్లో ఉన్న భూమిపై ఏం చేయాలనేది ఆలోచిస్తున్నాం. ప్రభుత్వం చేపట్టిన రీసర్వేలో కొన్ని ప్రైవేటు భూముల్ని కూడా దేవాదాయ భూములుగా చూపిస్తున్నారు. దీనిపై భూ హక్కుదారులు ఎన్‌వోసీ ఇవ్వాలని దేవాదాయశాఖ అధికారుల్ని ఆశ్రయిస్తున్నారు. వీటిపై విచారించి తగు చర్యలు తీసుకుంటున్నాం. అన్నవరంలోని వేదపాఠశాలలో కోర్సు పూర్తి చేసుకున్న విద్యార్థులకు ఉద్యోగాలను ఇవ్వాలని ఆలోచన చేస్తున్నాం’ అని తెలిపారు.
ఫలసాయం మాత్రమే వారిది, భూముల పర్యవేక్షణ ప్రభుత్వానిదే
అర్చకుల చేతుల్లో ఉన్న భూముల పర్యవేక్షణ దేవదాయ శాఖదేనని మంత్రి కొట్టు సత్యనారాయణ స్పష్టం చేశారు. భూముల నుంచి వచ్చే ఫలసాయాన్ని మాత్రమే వారు అనుభవించవచ్చన్నారు. రెవెన్యూ అధికారులు పరిపాలన చేస్తారు తప్ప, నామం ఎలా పెట్టాలో చెప్పరు కదా అన్నారు. నిబంధనలకు అనుగుణంగానే రెవెన్యూ శాఖ వారిని దేవదాయ శాఖలో తీసుకుంటున్నామని మంత్రి స్పష్టం చేశారు.
అర్చకుల చేతుల్లో ఉన్న భూములకు సంబంధించిన పర్యవేక్షణ దేవదాయ శాఖదేనని మంత్రి కొట్టు సత్యనారాయణ స్పష్టం చేశారు. అర్చకుల చేతుల్లో ఉన్న భూముల నుంచి వచ్చే ఫలసాయాన్ని మాత్రమే అనుభవించవచ్చన్నారు. దేవదాయ శాఖలో ఉద్యోగుల కొరతతోనే, నిబంధనలకు అనుగుణంగా రెవెన్యూ శాఖ వారిని దేవదాయ శాఖలో తీసుకుంటున్నామని మంత్రి వెల్లడించారు. ఐఏఎస్లు, రెవెన్యూ అధికారులు వచ్చినంత మాత్రాన శాస్త్ర ప్రకారం జరగదంటే ఎలా అని ఆయన ప్రశ్నించారు. 4.20 లక్షల ఎకరాల భూమి దేవదాయ శాఖ పరిధిలో ఉందని, వీటిలో కొన్ని ఆక్రమణలు ఉన్నాయని కొట్టు చెప్పారు.
ఇవి చదవండి: