ఆంధ్రప్రదేశ్

andhra pradesh

తెలంగాణ: హైదరాబాద్​ వేదికగా ఐపీఎల్​ నిర్వహించండి: కేటీఆర్​

By

Published : Feb 28, 2021, 2:55 PM IST

హైదరాబాద్​ వేదికగా ఐపీఎల్​ సీజన్​ను నిర్వహించాలని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖల మంత్రి కేటీఆర్ బీసీసీఐ, ఐపీఎల్ నిర్వాహకులను కోరారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి పూర్తి మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు.

ktr tweeted to look in hyderabad for coming ipl play hosting
హైదరాబాద్​ వేదికగా ఐపీఎల్​ నిర్వహించండి

రాబోయే ఐపీఎల్​ సీజన్​లో హైదరాబాద్​ను ఒక వేదికగా చేయాలని కోరుతూ... రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖల మంత్రి కేటీఆర్​ ట్వీట్ చేశారు. బీసీసీఐ, ఐపీఎల్ ఆఫీస్ బేరర్లను ట్యాగ్​ చేస్తూ​ ట్విట్టర్ వేదికగా విజ్ఞప్తి చేశారు.

భారత్​లోని మెట్రో నగరాలన్నింటిలో.. హైదరాబాద్​లోనే కొవిడ్ కేసులు తగ్గుముఖం పట్టాయన్న మంత్రి.. ఇది కరోనాపై రాష్ట్ర ప్రభుత్వ సమర్థవంతమైన చర్యలకు నిదర్శనమని పేర్కొన్నారు. ఐపీఎల్​ నిర్వహణకు తెలంగాణ సర్కార్​ నుంచి పూర్తి మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు.

రాబోయే ఐపీఎల్ సీజ‌న్ కోసం బీసీసీఐ ఆరు న‌గ‌రాల‌ను ప‌రిశీలిస్తోంది. దిల్లీతోపాటు ముంబయి, కోల్‌క‌తా, బెంగ‌ళూరు, చెన్నై, అహ్మ‌దాబాద్ ఉన్నాయి. బోర్డు ప‌రిశీల‌న‌లో హైద‌రాబాద్ పేరు లేకపోవడం వల్ల ఇక్క‌డి ప‌రిస్థితిని వివ‌రిస్తూ కేటీఆర్ ట్వీట్ చేశారు.

ఇదీ చదవండి:

ఇస్రో శాస్త్రవేత్తలకు అభినందనలు తెలిపిన సీఎం జగన్​

ABOUT THE AUTHOR

...view details