ఆంధ్రప్రదేశ్

andhra pradesh

CM KCR: 'కేఆర్‌ఎంబీ సమావేశంలో బలమైన వాణి వినిపించండి'

By

Published : Aug 20, 2021, 7:39 PM IST

ఈ నెల 27న కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం కానున్న నేపథ్యంలో తెలంగాణ సీఎం కేసీఆర్ దృష్టి సారించారు. ఈ మేరకు మంత్రులు, ఉన్నతాధికారులతో సమీక్ష చేపట్టారు. సమావేశంలో లేవనెత్తాల్సిన అంశాలపై దిశానిర్దేశం చేశారు. రాష్ట్రం తరపున బలమైన వాణిని వినిపించాలని స్పష్టం చేశారు.

CM KCR
telangana chief minister

నదీజలాల్లో తెలంగాణకు న్యాయమైన వాటా కోసం నదీ యాజమాన్య బోర్డుల సమావేశాల్లో బలమైన వాణి వినిపించాలని ఆ రాష్ట్ర సీఎం కేసీఆర్ అధికారులకు (cm kcr review on krmb) స్పష్టం చేశారు. నీటిపారుదల శాఖ అంశాలపై మంత్రులు, ఉన్నతాధికారులు, ఇంజినీర్లతో ప్రగతిభవన్​లో సమావేశం నిర్వహించారు. ఈ నెల 27న కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం (krmb meeting) జరగనుంది. ఈ నేపథ్యంలో సీఎం సమీక్ష నిర్వహించారు.

సమావేశంలో లేవనెత్తాల్సిన అంశాలపై చర్చ

బోర్డు సమావేశంలోని అజెండా అంశాలతో పాటు రాష్ట్రం తరఫున ప్రస్తావించాల్సిన, లేవనెత్తాల్సిన అంశాలపై ప్రధానంగా చర్చించారు. ఈ ఏడాది నుంచి కృష్ణా జలాల్లో చెరిసగం వాటా కావాలని తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే బోర్డుకు లేఖ రాసింది. ఈ అంశాన్ని కేఆర్ఎంబీ సమావేశ ఎజెండాలో చేర్చారు. అటు జలవిద్యుత్ ఉత్పత్తిపై ఏపీ అభ్యంతరాలపై చర్చించేందుకు కూడా ఎజెండాలో చేర్చారు. ఈ రెండింటితో పాటు ఇతర అంశాలకు సంబంధించి రాష్ట్రం పక్షాన వినిపించాల్సిన వాదనలపై ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేశారు.

అన్యాయాన్ని వివరించండి

సమగ్ర సమాచారంతో సమావేశానికి వెళ్లాలని... దశాబ్దాలుగా రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని వివరించడంతో పాటు న్యాయమైన, చట్టపరమైన అంశాల ఆధారంగా రాష్ట్రానికి హక్కుగా రావాల్సిన వాటా కోసం వాదనలు వినిపించాలని స్పష్టం చేశారు. కృష్ణా జలాల్లో ఏపీ, తెలంగాణ మధ్య 70:30 నిష్పత్తితో నీటిపంపిణీ సహా ఇతర అంశాలపై ఆంధ్రప్రదేశ్ రాసిన లేఖ కూడా సమావేశంలో ప్రస్తావనకు వచ్చింది. వాస్తవాలన్నీ బోర్డు ముందు ఉంచాలని అధికారులకు సీఎం కేసీఆర్ సూచించారు.

ఇదీ చూడండి:

Afghan Crisis: అమెరికా ఖర్చు ఘనం- ఫలితం మాత్రం...

ABOUT THE AUTHOR

...view details