ఆంధ్రప్రదేశ్

andhra pradesh

తెలంగాణ: వరద ప్రాంతాల్లో కేంద్ర బృందం పర్యటన

By

Published : Oct 22, 2020, 4:19 PM IST

తెలంగాణలో కురిసిన భారీ వర్షాల కారణంగా వచ్చిన వరదలతో.. జరిగిన నష్టాన్ని అంచనా వేసేందుకు ఐదురుగు సభ్యులతో కూడిన కేంద్ర బృందం హైదరాబాద్ పాతబస్తీలో పర్యటిస్తోంది. ముంపుప్రాంతాల్లో జరిగిన నష్టం వివరాలన సేకరించనున్నారు. రెండు రోజుల పర్యటన అనంతరం.. కేంద్రానికి నివేదిక సమర్పించనుంది.

Telangana: Central team tour in flood prone areas
తెలంగాణ: వరద ప్రాంతాల్లో కేంద్ర బృందం పర్యటన

తెలంగాణ రాష్ట్రంలో వరదలపై నష్టాన్ని అంచనా వేసేందుకు ఐదుగురు సభ్యులతో కూడిన కమిటీని కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. వారు గురువారం నుంచి రెండు రోజులపాటు తెలంగాణ వ్యాప్తంగా పర్యటించనున్నారు. అందులో భాగంగా పాతబస్తీలోని ఫలక్​నుమా ఓవర్​ బ్రిడ్జి, అల్​జుబైల్ కాలనీ, గాజి మిల్లత్​ కాలనీ, హాఫెజ్​ బాబానగర్​, చుట్టుపక్కల ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు.

నష్టాన్ని వివరిస్తున్న ఎంపీ అసద్

ముంపు ప్రాంతాల్లో వరద ఏ విధంగా వచ్చింది? నష్టం ఎంతమేర వాటిల్లింది? తదితర అంశాలను హైదరాబాద్​ ఎంపీ అసదుద్దీన్​ ఓవైసీ కేంద్ర బృందానికి వివరిస్తున్నారు. ఆయా ప్రాంతాల్లో జరిగిన నష్టం ప్రస్తుత పరిస్థి తదితర అంశాలపై వివరాలు సేకరిస్తున్నారు.

రెండు రోజుల పర్యటన

కేంద్ర ప్రభుత్వం నుంచి తక్షణ సాయంగా రూ. 1,350 కోట్ల విడుదల చేయాలని కోరుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి..తెలంగాణ సీఎం కేసీఆర్ ఇటీవల లేఖ రాశారు. దీనిపై స్పందించిన కేంద్రం.. వరద నష్టం అంచనా కోసం వచ్చిన ఐదుగురు సభ్యుల బృందాన్ని రాష్ట్రానికి పంపింది. వీరు రెండు రోజుల పాటు రాష్ట్రంలో పర్యటించి.. కేంద్రానికి నివేదిక ఇవ్వనున్నారు.

ఇదీ చదవండిఃవరద ప్రభావిత ప్రాంతాల్లో కేంద్ర బృందం పర్యటించాలి- సీపీఐ

ABOUT THE AUTHOR

...view details